Electric One: ఎలక్ట్రిక్‌ వన్‌ నుంచి రెండు విద్యుత్‌ స్కూటర్లు.. సింగిల్‌ ఛార్జింగ్‌తో 200KM

Electric One: గుజరాత్‌కు చెందిన విద్యుత్‌ వాహన తయారీ సంస్థ ఎలక్ట్రిక్‌ వన్‌ రెండు కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. సింగిల్‌ ఛార్జ్‌తో 200 కిలోమీటర్లు వెళ్లడం ఈ స్కూటర్ల ప్రత్యేకత.

Published : 28 Sep 2023 16:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గుజరాత్‌కు చెందిన విద్యుత్‌ వాహన తయారీ సంస్థ ఎలక్ట్రిక్‌ వన్‌ (Electric One) రెండు కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్లను భారత మార్కెట్లోకి తాజాగా లాంచ్‌ చేసింది. ఈ1 ఆస్ట్రో ప్రో (E1 Astro Pro), ఈ1 ఆస్ట్రో ప్రో 10 (E1 Astro Pro) పేరుతో ఈ స్కూటర్లను తీసుకొచ్చింది. ఈ1 అస్ట్రో ప్రో ధర రూ.99,999 (ఎక్స్‌షోరూమ్‌), ఈ1 ఆస్ట్రో ప్రో 10 ధర రూ.1,24,999  (ఎక్స్‌షోరూమ్‌)గా కంపెనీ నిర్ణయించింది. రెడ్ బెర్రీ, బ్లేజ్ ఆరెంజ్, ఎలిగెంట్ వైట్, మెటాలిక్ గ్రే, రేసింగ్ గ్రీన్ రంగుల్లో ఈ స్కూటర్‌లు లభిస్తాయని కంపెనీ తెలిపింది.

ఈ స్కూటర్ల ఫీచర్ల విషయానికొస్తే.. ఎలక్ట్రిక్‌ వన్‌ రెండు స్కూటర్లలోనూ ఫీచర్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. రెండింట్లోనూ 2400W విద్యుత్‌ అమర్చారు. టాప్‌ స్పీడ్‌ 65 కిలోమీటర్లు. ఆస్ట్రో ప్రో సింగిల్‌ ఛార్జింగ్‌తో 100 కిలోమీటర్లు, ఆస్ట్రో ప్రో 10తో 120 కిలోమీటర్లు దూరం ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. అయితే, ఆస్ట్రో ప్రో 10 మోడల్‌లో అడ్వెంచర్‌ ఎస్‌ బ్యాటరీ ద్వారా 200 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని కంపెనీ చెబుతోంది.

అమెజాన్‌ సేల్‌ తేదీలూ వచ్చేశాయ్‌.. కొన్ని ఫోన్లపై అప్పుడే డీల్స్‌!

ఇక రెండింట్లోనూ 72V లిథియమ్‌ అయాన్‌ బ్యాటరీని అమర్చారు. ఛార్జింగ్‌కు 3-4 గంటలు పడుతుంది. 2.9 సెకన్లలో 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయి. ముందూ వెనుక డిస్క్‌ బ్రేక్‌ సదుపాయం ఇస్తుున్నారు. రిమోట్‌ లాక్‌/అన్‌లాక్‌, యాంటీ థెఫ్ట్‌ అలారమ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రస్తుతానికి గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో, అస్సాంలో మాత్రమే ఆస్ట్రో ఎలక్ట్రిక్‌ వన్‌ స్కూటర్లు విక్రయిస్తున్నామని కంపెనీ తెలిపింది. రానున్న రోజుల్లో మిగిలిన రాష్ట్రాలతో పాటు, నేపాల్‌, శ్రీలంక దేశాల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు