EPF Forms: ఈపీఎఫ్ చందాదారులు ఏ సందర్భంలో ఏ ఫారం ఇవ్వాలి?
ఇంటర్నెట్ డెస్క్: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) దేశంలోనే అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థ. ఈపీఎఫ్ఓ తమ చందాదారులకు మూడు రకాల ప్రయోజనాలను అందిస్తుంది. 1. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్.. 1952), 2. ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్ ..1995), 3. ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సురెన్స్ స్కీమ్ (ఈడీఎల్ఐ..1976). ఈపీఎఫ్ఓ ప్రస్తుతం చాలా వరకు సేవలను ఆన్‌లైన్ ద్వారా అందిస్తోంది. అయితే, ఆఫ్‌లైన్ ద్వారా కూడా సేవలను పొందేందకు చందాదారులు వివిధ ఫారంలను పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం.
ఫారం 31: దీన్ని పీఎఫ్ అడ్వాన్స్ ఫారం అని కూడా అంటారు. ఈపీఎఫ్ ఖాతా నుంచి విత్‌డ్రాలు, రుణాలు, అడ్వాన్స్ కోసం ఈ ఫారం ఉపయోగిస్తారు.
ఫారం 10డి: ఈపీఎస్ కింద పెన్షన్ క్లెయిమ్ చేసేందుకు ఈ ఫారం ఇవ్వాల్సి ఉంటుంది. రిటైర్ అయిన వ్యక్తులు నెలవారీ పెన్షన్ పొందేందుకు తమ సంస్థ ద్వారా ఈ ఫారంను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఉద్యోగి మరణిస్తే, నామినీ లేదా ఆధారిత కుటుంబ సభ్యులు ఈ ఫారం ఇవ్వాల్సి ఉంటుంది.
ఫారం 10సి: ఉద్యోగి ఒక సంస్థ నుంచి రిటైరైనప్పుడు అతడికి రెండు ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. అతడు వేరే సంస్థలో చేరితే ఈ మొత్తాన్ని ఆ సంస్థకు బదిలీ చేసుకోవచ్చు లేదా డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. డబ్బు విత్‌డ్రా చేసుకునే వారు ఫారం 10సి ఇవ్వాల్సి ఉంటుంది.
ఫారం 13: ఉద్యోగం మారినప్పుడు పాత కంపెనీలో పీఎఫ్ మొత్తాన్ని కొత్త కంపెనీకి బదిలీ చేసేందుకు ఈ ఫారం ఉపయోగపడుతుంది. ఆన్‌లైన్ ద్వారా బ్యాలెన్స్ బదిలీ చేసుకునే వారు పాత లేదా కొత్త కంపెనీలో ఈ ఫారం ఇవ్వచ్చు. లేదా ఆన్‌లైన్ ద్వారా ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ అయ్యి సులభంగా ఖాతాను బదిలీ చేసుకోవచ్చు.
ఫారం 14: ఎల్ఐసీ ప్రీమియం చెల్లింపులు ఈపీఎఫ్ ఖాతా నుంచి చేయాలనుకున్నవారు ఈ ఫారం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే, రెండు సంవత్సరాల ఎల్ఐసీ ప్రీమియంలకు సరిపడా మొత్తం ఖాతాలో ఉన్నప్పుడు మాత్రమే ఇందకు అనుమతిస్తారు.
ఫారం 19: ఈపీఎఫ్ ఫైనల్ సెటిల్‌మెంట్ కోసం ఈ ఫారం ఉపయోగిస్తారు.
ఫారం 20: ఖాతాదారుడు మరణించిన సందర్భంలో పీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేసేందుకు కుటుంబ సభ్యులు ఈఫారం ఇవ్వాల్సి ఉంటుంది.
ఫారం 51 ఎఫ్: ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సురెన్స్ ప్రయోజనాలను క్లెయిమ్ చేసేందుకు నామినీ ఈ ఫారం పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) చందాదారుల కుటుంబాలకు సామాజిక ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రవేశపెట్టిందే ఎంప్లాయీస్ డిపాజిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఈ పథకం క్రింద ప్రస్తుతం ఈపీఎఫ్ సభ్యుల కుటుంబాలకు గరిష్ఠంగా రూ.7 లక్షల బీమా హామీ లభిస్తుంది. ఈపీఎఫ్ సభ్యుడు ఎవరైనా సరే ఉద్యోగంలో ఉండగా మృతిచెందినట్టయితే, కుటుంబ సభ్యులు ఈ ఫారం ఇవ్వాల్సి ఉంటుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-08-2022)
-
World News
Ukraine Crisis: ఉక్రెయిన్‌లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
-
India News
I-Day: స్వాతంత్య్ర వేడుకల వేళ పంజాబ్‌లో ఉగ్రముఠా కుట్రలు భగ్నం!
-
Sports News
Jadeja : రవీంద్ర జడేజా కంప్లీట్ ప్యాకేజ్.. కానీ భారీగా వికెట్లు తీస్తాడని మాత్రం ఆశించొద్దు!
-
Viral-videos News
Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్‌ఛైర్‌లో ఝున్‌ఝున్‌వాలా డ్యాన్స్
-
General News
Exercise: వ్యాయామం చేస్తే..ఆరోగ్యం మీ సొంతం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Taiwan: అగ్రరాజ్యం దూకుడు! తైవాన్‌లో అడుగుపెట్టిన మరో అమెరికా బృందం
- Ukraine Crisis: ఉక్రెయిన్‌లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
- Liger: సూపర్‌స్టార్ అంటే ఇబ్బందిగా ఫీలవుతా.. నేనింకా చేయాలి: విజయ్ దేవరకొండ
- Crime News: బిహార్‌లో తెలంగాణ పోలీసులపై కాల్పులు
- Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్‌ఛైర్‌లో ఝున్‌ఝున్‌వాలా డ్యాన్స్
- Jadeja : రవీంద్ర జడేజా కంప్లీట్ ప్యాకేజ్.. కానీ భారీగా వికెట్లు తీస్తాడని మాత్రం ఆశించొద్దు!
- Social Look: మహేశ్‌బాబు స్టైలిష్ లుక్.. తారా ‘కేకు’ వీడియో.. స్పెయిన్‌లో నయన్!
- UK PM Race: బ్రిటన్ ప్రధాని రేసులో.. ముందంజలో లిజ్ ట్రస్..!
- Sushil Modi: ప్రధాని రేసులో నీతీశే కాదు.. మమత, కేసీఆర్ వంటి నేతలూ ఉన్నారు..!
- Exercise: వ్యాయామం చేస్తే..ఆరోగ్యం మీ సొంతం