IPO: ఐపీఓల సందడి.. టాటా టెక్‌ సహా 4 కంపెనీల పబ్లిక్‌ ఇష్యూలు ప్రారంభం

IPO: రూ.5,150 కోట్ల సమీకరణ లక్ష్యంతో నాలుగు కంపెనీల ఐపీఓలు నవంబర్‌ 22న ప్రారంభమయ్యాయి. వీటిలో మదుపర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా టెక్‌ ఐపీఓ కూడా ఉంది.

Updated : 22 Nov 2023 11:35 IST

దిల్లీ: మార్కెట్లో నేడు ఐపీఓల సందడి నెలకొంది. నాలుగు కంపెనీల పబ్లిక్‌ ఇష్యూలు (IPO) ఈ రోజే ప్రారంభమయ్యాయి. మదుపర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా టెక్‌ సహా ఫ్లెయిర్‌ రైటింగ్‌, ఫెడ్‌బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, గాంధార్‌ ఆయిల్‌ రిఫైనరీ కంపెనీల షేర్ల సబ్‌స్క్రిప్షన్‌ ప్రక్రియ నేడు మొదలైంది. ఈ కంపెనీలన్నీ కలిపి దాదాపు రూ.5,150 కోట్లు సమీకరించనున్నాయి.

టాటా టెక్నాలజీస్‌ ఐపీఓ

మార్కెట్‌లో ఆసక్తి పెంచిన టాటా టెక్‌ ఐపీఓ (Tata Tech IPO) నవంబరు 22న ప్రారంభమై 24 వరకు కొనసాగనుంది. ఈ ఐపీఓ (Tata Tech IPO)లో 6.08 కోట్ల షేర్లను కంపెనీ అందుబాటులో ఉంచింది. ఈ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా టాటా మోటార్స్‌ తమ వాటాలో 11.4 శాతాన్ని ఉపసంహరించుకుంటోంది. అదనంగా ఆల్ఫా టీసీ హోల్డింగ్స్‌ 2.4 శాతం, టాటా క్యాపిటల్‌ గ్రోత్‌ ఫండ్‌-I 1.2 శాతం వాటాలను విక్రయిస్తున్నాయి. ఐపీఓ (Tata Tech IPO) పరిమాణాన్ని గణనీయంగా తగ్గించారు. తొలుత 9.57 కోట్ల షేర్లను విక్రయించాలనుకున్నారు. కానీ, దాన్ని తాజాగా 6.08 కోట్లకు కుదించారు. ఈ ఐపీఓ పూర్తిగా ‘ఆఫర్‌ ఫర్‌ సేల్‌’ ప్రాతిపదికన జరుగుతున్న నేపథ్యంలో సమీకరించిన నిధులు కంపెనీకి చెందబోవు. ఈ ఐపీఓలో 10 శాతం వాటాను ప్రత్యేకంగా టాటా మోటార్స్‌ వాటాదారుల కోసం రిజర్వ్‌ చేశారు.

2004లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ను పబ్లిక్‌ ఇష్యూకు తీసుకొచ్చిన టాటా గ్రూప్‌ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ మరో సంస్థను ఐపీఓ (Tata Tech IPO)కు తీసుకురావడం ఇదే. టాటా టెక్‌కు 18 అంతర్జాతీయ డెలివరీ కేంద్రాలున్నాయి. దీనిలో దాదాపు 11 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంజినీరింగ్‌, పరిశోధన-అభివృద్ధి (ఈఆర్‌అండ్‌డీ) సేవలు, డిజిటల్‌ ఎంటర్‌ప్రైజ్‌ సర్వీసెస్‌ (డీఈఎస్‌), ఎడ్యుకేషన్‌ ఆఫరింగ్స్‌, వాల్యూ యాడెడ్‌ రీసెల్లింగ్‌ అండ్‌ ఐప్రోడక్ట్స్‌ ఆఫరింగ్స్‌ విభాగాల్లో వ్యాపారాలున్నాయి. టాటా మోటార్స్‌, జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌ సహా టాటా గ్రూప్‌లోని ఇతర సంస్థలకు ఇది ప్రధానంగా సేవలందిస్తోంది.

ఐపీఓ వివరాలు సంక్షిప్తంగా..

  • ఐపీఓ తేదీలు: నవంబరు 22-24
  • ఒక్కో షేరు ముఖ విలువ : రూ.2
  • ధరల శ్రేణి : రూ.475- 500
  • కనీసం ఆర్డర్‌ చేయాల్సిన షేర్లు : 30 (ఒక లాట్‌)
  • కనీస పెట్టుబడి: రూ.15,000 (గరిష్ఠ ధర వద్ద)
  • షేర్ల కేటాయింపు తేదీ : నవంబరు 30
  • రిఫండ్ల ప్రారంభ తేదీ : డిసెంబరు 1
  • డీమ్యాట్‌ ఖాతాకు షేర్ల బదిలీ : డిసెంబరు 4
  • లిస్టింగ్‌ తేదీ : డిసెంబరు 5

ఫ్లెయిర్‌ రైటింగ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌

పెన్నుల తయారీ కంపెనీ ఫ్లెయిర్‌ రైటింగ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌.. (Flair Writing Industries IPO)  రూ.593 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఐపీఓకు వచ్చింది. నవంబర్‌ 22న ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభమై 24న ముగియనుంది. ఐపీఓలో రూ.292 కోట్లకు సమానమైన ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనున్నారు. మరో రూ.301 కోట్లకు సమానమైన ప్రమోటర్ల వాటాలను విక్రయించనున్నారు.

ఐపీఓ వివరాలు సంక్షిప్తంగా..

  • ఐపీఓ తేదీలు: నవంబరు 22-24
  • ఒక్కో షేరు ముఖ విలువ : రూ.5
  • ధరల శ్రేణి : రూ.288- 304
  • కనీసం ఆర్డర్‌ చేయాల్సిన షేర్లు : 49 (ఒక లాట్‌)
  • కనీస పెట్టుబడి: రూ.14,896 (గరిష్ఠ ధర వద్ద)
  • షేర్ల కేటాయింపు తేదీ : నవంబరు 30
  • రిఫండ్ల ప్రారంభ తేదీ : డిసెంబరు 1
  • డీమ్యాట్‌ ఖాతాకు షేర్ల బదిలీ : డిసెంబరు 4
  • లిస్టింగ్‌ తేదీ : డిసెంబరు 5

ఫెడ్‌బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌

రూ.1,092 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఫెడరల్‌ బ్యాంక్‌ అనుబంధ సంస్థ ఫెడ్‌బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఐపీఓ (Fedbank Financial Services IPO)కి వచ్చింది. ఈ ఐపీఓ కూడా ఈరోజు ప్రారంభమై 24న ముగియనుంది. రూ.660 కోట్లు విలువ చేసే కొత్త షేర్లతో పాటు రూ.492 కోట్లు విలువ చేసే షేర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా అందుబాటులో ఉన్నాయి.

ఐపీఓ వివరాలు సంక్షిప్తంగా..

  • ఐపీఓ తేదీలు: నవంబరు 22-24
  • ఒక్కో షేరు ముఖ విలువ : రూ.10
  • ధరల శ్రేణి : రూ.133- 140
  • కనీసం ఆర్డర్‌ చేయాల్సిన షేర్లు : 107 (ఒక లాట్‌)
  • కనీస పెట్టుబడి: రూ.14,980 (గరిష్ఠ ధర వద్ద)
  • షేర్ల కేటాయింపు తేదీ : నవంబరు 30
  • రిఫండ్ల ప్రారంభ తేదీ : డిసెంబరు 1
  • డీమ్యాట్‌ ఖాతాకు షేర్ల బదిలీ : డిసెంబరు 4
  • లిస్టింగ్‌ తేదీ : డిసెంబరు 5

గాంధార్‌ ఆయిల్‌ రిఫైనరీ

గాంధార్‌ ఆయిల్‌ రిఫైనరీ ఇండియా ఐపీఓ (Gandhar Oil Refinery IPO) సైతం నవంబర్‌ 22న ప్రారంభమై 24న ముగుస్తుంది. ధరల శ్రేణి రూ.160- 169. మదుపర్లు రూ.14,872తో కనీసం 88 షేర్లు కొనాలి. మొత్తం రూ.500 కోట్లు సమీకరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. రూ.302 కోట్లకు సమానమైన తాజా షేర్లతో పాటు 198 కోట్లు విలువ చేసే షేర్లను ప్రమోటర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా విక్రయిస్తున్నారు.

ఐపీఓ వివరాలు సంక్షిప్తంగా..

  • ఐపీఓ తేదీలు: నవంబరు 22-24
  • ఒక్కో షేరు ముఖ విలువ : రూ.2
  • ధరల శ్రేణి : రూ.160- 169
  • కనీసం ఆర్డర్‌ చేయాల్సిన షేర్లు : 88 (ఒక లాట్‌)
  • కనీస పెట్టుబడి: రూ.14,872 (గరిష్ఠ ధర వద్ద)
  • షేర్ల కేటాయింపు తేదీ : నవంబరు 30
  • రిఫండ్ల ప్రారంభ తేదీ : డిసెంబరు 1
  • డీమ్యాట్‌ ఖాతాకు షేర్ల బదిలీ : డిసెంబరు 4
  • లిస్టింగ్‌ తేదీ : డిసెంబరు 5
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని