Foxconn: ఈవీల తయారీలోకి ఫాక్స్‌కాన్‌.. 4 రాష్ట్రాలతో చర్చలు!

Foxconn in EV space: తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌ సంస్థ విద్యుత్‌ వాహన రంగంలోకి ప్రవేశించనుంది. ఈ ఏడాదే ఓ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం నాలుగు రాష్ట్రాలతో చర్చలు జరుపుతోంది.

Published : 16 Jun 2023 14:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో ఐఫోన్లను తయారు చేసే కంపెనీగా సుపరిచితమైన తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌ (Foxconn) సంస్థ విద్యుత్‌ వాహనాల (Electric vehicles) తయారీలోకి ప్రవేశించబోతోంది. ఇందుకోసం దేశంలో ఈ ఏడాదే ఓ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతోంది. ఇందుకోసం నాలుగు రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ప్లాంట్‌ ఏర్పాటు కోసం ఫాక్స్‌కాన్‌ చర్చలు జరుపుతున్న రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు కూడా ఉన్నాయి. మహారాష్ట్రలో ప్లాంట్‌ నెలకొల్పేందుకు అవకాశం ఉన్నా.. కొన్ని సవాళ్ల కారణంగా తమిళనాడువైపు మొగ్గు చూపే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే తమిళనాడులో ఆ కంపెనీ ఐఫోన్‌ తయారీ హబ్‌ను ఏర్పాటు చేసింది. మరోవైపు ప్రోత్సాహకాలు, సంప్రదింపుల విషయంలో యాక్టివ్‌గా ఉంటున్న తెలంగాణను సైతం పరిశీలించే అవకాశం లేకపోలేదని తెలిపాయి.

అయితే, ఫాక్స్‌కాన్‌ ఏర్పాటు చేయబోయే తయారీ ప్లాంట్‌లో జాయింట్‌ వెంచర్‌ ద్వారా సింగిల్‌ బ్రాండ్‌ వాహనాలను తయారుచేస్తారా? లేదంటే కాంట్రాక్ట్‌ పద్ధతితో వివిధ బ్రాండ్ల వాహనాలను తయారు చేస్తారా? అనే దానిపై స్పష్టత రాలేదు. దీనిపై ఫాక్స్‌కాన్‌ ఇండియా ప్రతినిధులు త్వరలోనే తైవాన్‌లో పర్యటించనున్నారు. కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లతో చర్చలు జరపనున్నారు. మరోవైపు సెమీకండక్టర్‌ చిప్స్‌ తయారీకి ఫాక్స్‌కాన్‌, వేదాంత కలిపి 2022లో జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని