pollution tax: డీజిల్‌ వాహనాలపై పొల్యూషన్‌ ట్యాక్స్‌ వేయనున్నారా? గడ్కరీ క్లారిటీ..

pollution tax: డీజిల్‌ వాహనాలపై అదనంగా ‘పొల్యూషన్‌ ట్యాక్స్‌’ వేయబోతున్నారంటూ వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ క్లారిటీ ఇచ్చారు.

Updated : 12 Sep 2023 14:11 IST

pollution tax | దిల్లీ: డీజిల్‌ వాహనాలపై అదనంగా ‘పొల్యూషన్‌ ట్యాక్స్‌’ వేయబోతున్నారంటూ వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ క్లారిటీ ఇచ్చారు. అలాంటి ప్రతిపాదనేదీ ప్రస్తుతానికి పరిశీలనలో లేదని స్పష్టం చేశారు. అయితే, సున్నా కర్బన ఉద్గారాల లక్ష్యం దిశగా.. స్వచ్ఛ ఇంధనాలను ప్రోత్సహించాల్సిన అవసరం మాత్రం ఉందని తెలిపారు. డీజిల్‌ వాహనాల విక్రయాలను నిరుత్సాపరచాలనే ఉద్దేశంతో వాటి అమ్మకాలపై 10 శాతం అదనంగా జీఎస్టీ (GST) విధించాలని కేంద్రం ప్రతిపాదించబోతున్నట్లు మీడియాలో మంగళవారం ఉదయం వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలోనే గడ్కరీ స్పందించి అలాంటి ఆలోచనైతే ప్రస్తుతానికి లేదని తేల్చి చెప్పారు.

సియామ్‌ వార్షిక సదస్సులో మంగళవారం పాల్గొన్న గడ్కరీ.. డీజిల్‌ వాహనాల ఉత్పత్తి తగ్గించాలని ఆటోమొబైల్‌ను పరిశ్రమను కోరారు. దేశంలో ఇప్పటికే డీజిల్‌ కార్ల సంఖ్య తగ్గుముఖం పట్టిందని, తయారీ సంస్థలు వాటిని ఇంకా తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పర్యావరణానికి డీజిల్‌ హాని కలిగిస్తోందని, దీనివల్ల దిగుమతుల బిల్లూ పెరుగుతోందన్నారు. పర్యావరణహితమైన వాహనాల ఉత్పత్తిపై దృష్టి సారించాలని ఆటోమొబైల్‌ సంస్థలను కోరారు. ఈ క్రమంలోనే పొల్యూషన్‌ ట్యాక్స్‌ ప్రతిపాదన తీసుకొచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీన్ని గడ్కరీ ఖండించారు.

ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌ గడువు మరోసారి పెంపు.. కొత్త డెడ్‌లైన్‌ ఇదే..!

ఈ వార్తల నేపథ్యంలో ఆటోమొబైల్‌ కంపెనీల షేర్లు సైతం మంగళవారం ఒడుదొడుకుల్లో చలించాయి. మరోవైపు ప్రయాణికుల వాహన విభాగంలో మారుతీ సుజుకీ, హోండా వంటి కంపెనీలు డీజిల్‌ కార్ల తయారీని ఇప్పటికే నిలిపివేశాయి. దేశంలో కమర్షియల్‌ వాహనాలన్నీ డీజిల్‌తోనే నడుస్తున్నాయి. ప్రస్తుతం వాహనాలకు 28 శాతం జీఎస్టీ వర్తిస్తోంది. వాహన రకం బట్టి 1-22 శాతం వరకు అదనపు సెస్సు విధిస్తున్నారు. ఎస్‌యూవీలకు గరిష్ఠంగా 28 శాతం జీఎస్టీ, 22 శాతం సెస్సు వసూలు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని