Andhra Petro chemicals: ఆంధ్రా పెట్రోకెమికల్స్‌ లాభాల్లో క్షీణత

ఆంధ్రా పెట్రోకెమికల్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.249.53 కోట్ల ఆదాయాన్ని, రూ.29.22 కోట్ల నికరలాభాన్ని, రూ.3.44 ఈపీఎస్‌ను ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.246.19 కోట్లు, నికరలాభం రూ.62.74 కోట్లు ఉండటం గమనార్హం.

Updated : 10 Aug 2022 15:14 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రా పెట్రోకెమికల్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.249.53 కోట్ల ఆదాయాన్ని, రూ.29.22 కోట్ల నికరలాభాన్ని, రూ.3.44 ఈపీఎస్‌ను ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.246.19 కోట్లు, నికరలాభం రూ.62.74 కోట్లు ఉండటం గమనార్హం. దీంతో పోల్చితే లాభాలు సగానికి సగం తగ్గినట్లు స్పష్టమవుతుంది. ముడిపదార్థాల వ్యయం, సిబ్బంది ఖర్చులు, విద్యుత్తు- ఇంథన ఛార్జీలు పెరిగినందున లాభాలు తగ్గినట్లు స్పష్టమవుతోంది. ముడిపదార్థాల వ్యయం రూ.120 కోట్ల నుంచి రూ.168 కోట్లకు పెరిగింది.


రూ.1,000 కోట్లు సమీకరిస్తాం: ఐఓబీ

చెన్నై: ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ) అర్హులైన సంస్థాగత మదుపర్లకు షేర్లను కేటాయించడం ద్వారా రూ.1,000 కోట్లు సమీకరించాలనుకుంటోంది. బ్యాంక్‌ బోర్డు ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకుంది. బ్యాంక్‌ వ్యాపార విస్తరణకు ఈ నిధుల్ని వినియోగిస్తామని, వృద్ధి వ్యూహానికి ఈ మూలధనం సరిపోతుందని బ్యాంక్‌ ఎండీ, సీఈఓ పార్థ ప్రతిమ్‌ వెల్లడించారు.


పాల్‌రెడ్‌ టెక్నాలజీస్‌ లాభం రూ.65 లక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: పాల్‌రెడ్‌ టెక్నాలజీస్‌ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ఖాతాల ప్రకారం రూ.37.22 కోట్ల ఆదాయాన్ని, రూ.65.27 లక్షల నికరలాభాన్ని ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే  కాలంలో ఆదాయం రూ.27.17 కోట్లు, లాభం రూ.31.32 లక్షలుగా ఉంది. ఈ సంస్థ ఇ-కామర్స్‌ విభాగంలో వ్యాపార కార్యకలాపాలు సాగిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు