అపోలో హాస్పిటల్స్‌కు రూ.324 కోట్ల లాభం

అపోలో హాస్పిటల్స్‌ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ఖాతాల ప్రకారం రూ.3,811.66 కోట్ల ఆదాయాన్ని, రూ. 323.78 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఈపీఎస్‌ రూ.22.05 ఉంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.3,784.85 కోట్లు, నికరలాభం రూ.500.68 కోట్లు ఉన్నాయి.

Published : 12 Aug 2022 03:13 IST

ఈనాడు, హైదరాబాద్‌: అపోలో హాస్పిటల్స్‌ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ఖాతాల ప్రకారం రూ.3,811.66 కోట్ల ఆదాయాన్ని, రూ. 323.78 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఈపీఎస్‌ రూ.22.05 ఉంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.3,784.85 కోట్లు, నికరలాభం రూ.500.68 కోట్లు ఉన్నాయి. దీంతో పోలిస్తే ఆదాయం పెరిగినప్పటికీ లాభాలు తగ్గినట్లు తెలుస్తోంది. ప్రస్తుత మొదటి త్రైమాసికంలో వైద్య సేవల ఆదాయాలు పెరిగాయి. కానీ క్లినిక్స్‌, ఫార్మసీ ఆదాయాలు తక్కువగా నమోదయ్యాయి. వ్యయాల్లో పెరుగుదల కనిపిస్తోంది. దీనివల్ల లాభాలు తగ్గినట్లు స్పష్టమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని