మొబైల్‌ తెరకు అమర్చే భాగాలపై 15 శాతం దిగుమతి సుంకం: సీబీఐసీ

తూర్పు ఆఫ్రికా దేశమైన టాంజానియాలో 60 పడకల ఆస్పత్రిని నిర్వహించేందుకు అపోలో హాస్పిటల్స్‌ సిద్ధమవుతోంది. ఈ మేరకు టాంజానియాలోని ఒక హాస్పిటల్స్‌ గ్రూపుతో అపోలో హాస్పిటల్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

Published : 20 Aug 2022 02:37 IST

దిల్లీ: మొబైల్‌ తెర (డిస్‌ప్లే)కు అనుసంధానించే స్పీకర్లు, సిమ్‌ ట్రే, పవర్‌ కీ వంటి ఉత్పత్తులపై 15 శాతం బేసిక్‌ కస్టమ్స్‌ సుంకం విధిస్తున్నట్లు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ) వెల్లడించింది.  ప్రస్తుతం మొబైల్‌ ఫోన్ల డిస్‌ప్లేపై 10 శాతం కస్టమ్స్‌ సుంకం విధిస్తున్నారు.  డిస్‌ప్లే అసెంబ్లీ తయారీలో వినియోగించే భాగాలపై సుంకం ఏమీ విధించడం లేదు.  సిమ్‌ ట్రే, యాంటెన్నా పిన్‌, స్పీకర్‌ నెట్‌, పవర్‌ కీ, స్లైడర్‌ స్విచ్‌, బ్యాటరీ భాగం, శబ్దం-విద్యుత్తు-సెన్సార్లు-స్పీకర్లు-వేలిముద్రకు ఉపయోగపడే ఫ్లెక్సిబుల్‌ ప్రింటెడ్‌ సర్క్యూట్‌లు తెరతో వచ్చినా, విడిగా దిగుమతి చేసుకున్నా కూడా 15 శాతం దిగుమతి సుంకం చెల్లించాల్సిందేనని ప్రకటించింది. సుంకం ఎగవేతలను నివారించేందుకే ఈ స్పష్టత ఇస్తున్నట్లు తెలిపింది.


టాంజానియాలో అపోలో ఆసుపత్రి!

హైదరాబాద్‌: తూర్పు ఆఫ్రికా దేశమైన టాంజానియాలో 60 పడకల ఆస్పత్రిని నిర్వహించేందుకు అపోలో హాస్పిటల్స్‌ సిద్ధమవుతోంది. ఈ మేరకు టాంజానియాలోని ఒక హాస్పిటల్స్‌ గ్రూపుతో అపోలో హాస్పిటల్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం అపోలో బ్రాండు పేరుతో దీన్ని నిర్వహిస్తారు. వచ్చే మూడేళ్లలో ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని