గంటకు 56,000 మొబైల్స్‌ విక్రయం

ఇ-కామర్స్‌ సంస్థలు పండుగ సీజన్‌ సేల్‌-1లో (సెప్టెంబరు 22-30) సుమారు రూ.40,000 కోట్ల విక్రయాలు నమోదు చేశాయని రెడ్‌సీర్‌ స్ట్రాటెజీ కన్సల్టింగ్‌ నివేదిక అంచనా వేసింది. గతేడాది కంటే ఈ మొత్తం సుమారు 27 శాతం అధికమని పేర్కొంది.

Published : 07 Oct 2022 02:06 IST

రూ.40,000 కోట్ల మేర ‘ఇ-కామర్స్‌’ అమ్మకాలు

దిల్లీ: ఇ-కామర్స్‌ సంస్థలు పండుగ సీజన్‌ సేల్‌-1లో (సెప్టెంబరు 22-30) సుమారు రూ.40,000 కోట్ల విక్రయాలు నమోదు చేశాయని రెడ్‌సీర్‌ స్ట్రాటెజీ కన్సల్టింగ్‌ నివేదిక అంచనా వేసింది. గతేడాది కంటే ఈ మొత్తం సుమారు 27 శాతం అధికమని పేర్కొంది. ప్రధానంగా మొబైల్‌ ఫోన్ల విక్రయాలు పెరగడం, వృద్ధికి ఉపకరించిందని వెల్లడించింది. మొత్తం స్థూల మర్కండైజ్‌ విలువ (జీఎంవీ)లో ఈ విభాగం వాటా 41 శాతం ఉందని తెలిపింది. సగటున గంటకు 56,000 మొబైల్స్‌ విక్రయమయ్యాయని పేర్కొంది. సెల్‌ఫోన్ల అమ్మకాలు 7 రెట్లు, ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాల విక్రయాలు 5 రెట్లు, ఇతర విభాగాల అమ్మకాలు 2 రెట్లు పెరిగినట్లు వివరించింది. ఫ్యాషన్‌ ఉత్పత్తుల విభాగం వాటా మొత్తం జీఎంవీలో 20 శాతంగా ఉందని, ఏడాది క్రితంతో పోలిస్తే ఈ విభాగ అమ్మకాలు 48 శాతం పెరిగినట్లు రెడ్‌సీర్‌ స్ట్రాటెజీ కన్సల్టెంట్స్‌ అసోసియేట్‌ పార్ట్‌నర్‌ సంజయ్‌ కొఠారి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు