3 విమానాశ్రయాల్లో డిజియాత్ర సేవలు

ప్రయాణికులు విమానాశ్రయాల్లోకి సులభంగా, వేగంగా ప్రవేశించేందుకు ఉపకరించే ‘డిజియాత్ర’ సేవలను దిల్లీ, బెంగళూరు, వారణాసి విమానాశ్రయాల్లో ప్రభుత్వం గురువారం ప్రారంభించింది.

Published : 02 Dec 2022 04:23 IST

2023 మార్చికి హైదరాబాద్‌, విజయవాడల్లో

దిల్లీ: ప్రయాణికులు విమానాశ్రయాల్లోకి సులభంగా, వేగంగా ప్రవేశించేందుకు ఉపకరించే ‘డిజియాత్ర’ సేవలను దిల్లీ, బెంగళూరు, వారణాసి విమానాశ్రయాల్లో ప్రభుత్వం గురువారం ప్రారంభించింది. ముఖ గుర్తింపు సాంకేతికత ఆధారంగా డిజియాత్ర సేవలు లభిస్తాయి. ప్రయాణికుల వివరాలను ఎన్‌క్రిప్టెడ్‌ రూపంలో, వికేంద్రీకరణ పద్ధతిలో సురక్షితంగా భద్రపరుస్తామని కేంద్ర పౌరవిమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. 2023 మార్చికి మరో నాలుగు విమానాశ్రయాలు- హైదరాబాద్‌, విజయవాడ, పుణె, కోల్‌కతాల్లో ఈ సేవలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో చేపడతామని వివరించారు.

ఈ సేవలు పొందేందుకు: డిజియాత్ర యాప్‌ను ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ప్లాట్‌ఫామ్‌ల నుంచి ప్రయాణికులు తమ మొబైల్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. తమ ఆధార్‌తో పాటు స్వీయ చిత్రం ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలి. అనంతరం బోర్డింగ్‌ పాస్‌ను స్కాన్‌ చేసి, వివరాలను తమ ప్రయాణ సమయానికి 24 గంటల ముందుగా విమానాశ్రయానికి ఇవ్వాలి. విమానాశ్రయం ఇ-గేట్‌ వద్ద బార్‌కోడ్‌ కలిగిన బోర్డింగ్‌ పాస్‌, ముఖగుర్తింపు వ్యవస్థ సాయంతో ప్రయాణికుల గుర్తింపు, ప్రయాణ పత్రాలను ధ్రువీకరిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక సత్వరం విమానాశ్రయంలోకి ప్రవేశించవచ్చు. భద్రతా పరమైన ఇతర నిబంధనలు, విమానం ఎక్కేందుకు సాధారణ నియామవళి ఉంటుంది. ప్రయాణించిన 24 గంటల తరవాత విమానాశ్రయ సర్వర్లలో ప్రయాణికుల డేటా ఉండదు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని