Marico: ఉద్యోగం నుంచి విరమణ తీసుకున్న వారికి మారికో మరో అవకాశం

ఏదేని కారణంతో మధ్యలోనే ఉద్యోగం నుంచి వైదొలగారా.. మళ్లీ ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారా..

Updated : 02 Dec 2022 09:27 IST

దిల్లీ: ఏదేని కారణంతో మధ్యలోనే ఉద్యోగం నుంచి వైదొలగారా.. మళ్లీ ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారా.. అయితే మీలాంటి వారి కోసమే ఎఫ్‌ఎమ్‌సీజీ సంస్థ ‘మారికో’.. ‘ఫోనిక్స్‌’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఉద్యోగ జీవితంలో కనీసం ఒక ఏడాది విరామం ఇచ్చిన వృత్తి నిపుణులకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది.

‘ఆరోగ్య కారణాలు కావచ్చు.. వేరే ఇతర ఆశయాల సాధన కోసం కావచ్చు.. ఉద్యోగ జీవితానికి విరామం ఇచ్చిన వారి వ్యక్తిత్వాన్ని ఈ కార్యక్రమం గౌరవిస్తుంద’ని సంస్థ తెలిపింది. అయితే విరామానికి ముందు కనీసం రెండేళ్ల పాటు ఉద్యోగం చేసిన అనుభవం ఉన్న వాళ్లు ఈ కార్యక్రమానికి అర్హులని పేర్కొంది. ఇందులో ప్రాజెక్ట్‌ ఆధారితంగా నియామకాలు ఉంటాయి. 6 నెలలు, 9 నెలలు, 12 నెలల సమయానికి కన్సల్టెంట్‌లుగా నియమించుకుంటారు. ఆ తర్వాత వారి పనితీరు, ఉద్యోగ ఖాళీల ఆధారంగా.. వారిని పూర్తి స్థాయిలో కంపెనీలోకి చేర్చుకుంటారు. లేటరల్‌ హైరింగ్‌లో.. అనుభవం ఆధారంగా నేరుగా నియామకాలు చేపడతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని