పట్టణ సహకార బ్యాంకులకు ఆర్‌బీఐ నాలుగంచెల నియమావళి

పట్టణ సహకార బ్యాంకుల (యూసీబీలు) వర్గీకరణ కోసం నాలుగు అంచెల నిబంధనల నియమావళిని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గురువారం ప్రకటించింది.

Published : 02 Dec 2022 03:40 IST

ముంబయి: పట్టణ సహకార బ్యాంకుల (యూసీబీలు) వర్గీకరణ కోసం నాలుగు అంచెల నిబంధనల నియమావళిని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గురువారం ప్రకటించింది. ఈ బ్యాంకుల నికర సంపద, మూలధన సమర్థతకు సంబంధించిన నిబంధనలను సైతం విడుదల చేసింది. సహకార బ్యాంకుల రంగంలో ఉన్న వైవిధ్యం కారణంగానే, ప్రస్తుత రెండంచెల నియమావళి స్థానంలో నాలుగంచెల నియమావళిని తీసుకురావాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. యూసీబీల డిపాజిట్ల పరిమాణం ఆధారంగా తీసుకొచ్చిన ఈ నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ఆర్‌బీఐ తెలిపింది. దీని ప్రకారం యూసీబీలను టైర్‌ 1, టైర్‌ 2గా వర్గీకరించారు. అన్ని యూనిట్‌ యూసీబీలు, వేతన ఆర్జన యూసీబీలు, రూ.100 కోట్ల వరకు డిపాజిట్లు కలిగిన ఇతర యూసీబీలను టైర్‌-1గా ఆర్‌బీఐ వర్గీకరించింది. రూ.100-1000 కోట్ల మధ్య డిపాజిట్లు కలిగిన యూసీబీలు టైర్‌-2గా, రూ.1000-10000 కోట్ల డిపాజిట్లు కలిగిన బ్యాంకులు టైర్‌-3గా, రూ.10000 కోట్లు పైబడిన యూసీబీలు టైర్‌-4గా విభజించింది.
* ఒక జిల్లాలో నిర్వహంచే టైర్‌ 1 యూసీబీల నికర విలువ కనీసం రూ.2 కోట్లు ఉండాలి. మిగిలిన అన్నీ రూ.5 కోట్ల కనీస విలువ కలిగి ఉండాలి. ప్రస్తుత బ్యాంకులు కూడా దశల వారీగా ఈ స్థాయికి చేరాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని