జనవరి నుంచి కార్ల ధరలు పెంపు

కార్ల కంపెనీలన్నీ వరుసగా ధరల పెంపును ప్రకటిస్తున్నాయి. జనవరి నుంచి ధరలు పెంచుతున్నట్లు మెర్సిడెస్‌-బెంజ్‌, ఆడి, రెనో, కియా ఇండియా, ఎంజీ మోటార్‌ బుధవారం తెలిపాయి.

Published : 08 Dec 2022 02:45 IST

జాబితాలో బెంజ్‌, ఆడి, రెనో, కియా, ఎంజీ  

దిల్లీ: కార్ల కంపెనీలన్నీ వరుసగా ధరల పెంపును ప్రకటిస్తున్నాయి. జనవరి నుంచి ధరలు పెంచుతున్నట్లు మెర్సిడెస్‌-బెంజ్‌, ఆడి, రెనో, కియా ఇండియా, ఎంజీ మోటార్‌ బుధవారం తెలిపాయి. కమొడిటీల ధరలు పెరగడం, విదేశీ మారకపు రేట్లలో హెచ్చుతగ్గులు, బీఎస్‌-6 సాంకేతికతకు మార్పు చేసేందుకు అవుతున్న వ్యయాలే ఇందుకు కారణమని కంపెనీలు వివరించాయి. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్‌ ఇప్పటికే ధరల పెంపును ప్రకటించాయి.

అన్ని మోడళ్లపై ఆడి ఇండియా 1.7% వరకు; మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా 5% వరకు ధరలు పెంచుతున్నాయి.

మోడల్‌, వేరియంట్‌ను బట్టి కియా ఇండియా రూ.50,000 వరకు ప్రియం చేస్తోంది.

రెనో కూడా ధర పెంచుతున్నట్లు చెప్పినా.. ఎంత మేర అన్నది వెల్లడించలేదు.

ఎమ్‌జీ మోటార్‌ ధరలను 2-3 శాతం సవరించనున్నట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని