చాట్‌జీపీటీకి పోటీగా గూగుల్ ‘బార్డ్’
‘పర్యావరణంపై వ్యాసం కావాలి..’ అని పాఠశాల విద్యార్థి గూగుల్‌సెర్చ్‌లో నమోదు చేయగానే, అతని అంచనాకు అనువైన ఓ వ్యాసం ప్రత్యక్షమవుతుంది.
త్వరలోనే ఆవిష్కరిస్తామన్న సుందర్ పిచాయ్
న్యూయార్క్: ‘పర్యావరణంపై వ్యాసం కావాలి..’ అని పాఠశాల విద్యార్థి గూగుల్‌సెర్చ్‌లో నమోదు చేయగానే, అతని అంచనాకు అనువైన ఓ వ్యాసం ప్రత్యక్షమవుతుంది. వైద్యులు తమకు కావాల్సిన సంక్లిష్ట అంశాలనూ తెలుసుకోవచ్చు..ఇలా విభిన్న వర్గాల వారు తమకు తెలియని ప్రశ్నలకు సమాధానం అడిగినా.. ఎంచక్కా చెప్పేస్తుంది. ప్రసంగాలు, పాటలు, మార్కెటింగ్ కాపీలనూ అందిస్తుందట. ఉచితంగా, చెల్లింపులతో సేవలందిస్తున్న మైక్రోసాఫ్ట్ చాట్‌జీపీటీ యాప్‌నకు పోటీగా.. గూగుల్ త్వరలోనే ఆవిష్కరించనున్న‘బార్డ్’ అనే ఏఐ (కృత్రిమ మేధ) ఆధారిత చాట్‌బాట్ ఈ సేవలందిస్తుందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. ‘లాంగ్వేజ్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్’ (లామ్డా) ద్వారా రూపొందించిన ఈ యాప్‌ను ఇప్పటికే ‘విశ్వసనీయ వ్యక్తుల’ బృందం పరీక్షిస్తోందట.
ఏముంటాయంటే..: ‘తొమ్మిదేళ్ల పిల్లలకూ అర్థమయ్యేలా అంతరిక్ష విజ్ఞానాన్ని వివరిస్తుంది. ప్రపంచంలోని విజ్ఞానానికి తెలివి, సృజనాత్మకత జోడించి పలు భాషల్లో సమాచారం అందించగలుగుతుంది. తొలుత తేలికపాటి నమూనాగా విడుదల చేస్తాం. తక్కువ కంప్యూటింగ్ సామర్థ్యంతో ఎక్కువ మంది వినియోగదార్లకు, ఎక్కువ స్పందనలు అందించేలా చేస్తాం. వాస్తవ ప్రపంచంలోని సమాచారానికి సరిపోయేలా నాణ్యత, భద్రత విషయంలో అత్యన్నత ప్రమాణాలను చేరేలా బార్డ్ పనితీరు ఉండేలా అంతర్గత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు’ పిచాయ్ వివరించారు.
గూగుల్ ‘సెర్చ్’లో ఏఐ ఆధారిత టూల్స్: త్వరలోనే గూగుల్ ‘సెర్చ్’ టూల్‌లో ఏఐ ఆధారిత టూల్స్ ప్రారంభించనున్నట్లు సీఈఓ తెలిపారు. ఇందువల్ల సంక్లిష్ట సమాచారాన్ని.. పలు కోణాల్లో సులువుగా అర్థం చేసుకునేందుకు వీలవుతుంది.
బార్డ్.. చాట్‌జీపీటీకి తేడా ఏమిటంటే..: 2021కి ముందున్న సమాచారం ఆధారంగా చాట్‌జీపీటీ పనిచేస్తుండగా.. బార్డ్ మాత్రం ఆన్‌లైన్‌లో ఉన్న తాజా సమాచారం ఆధారంగా పనిచేయనుంది. 2022 నవంబరులో చాట్‌జీపీటీ అందుబాటులోకి రాగా.. బార్డ్‌ను వినియోగించడానికి మరింత సమయం పట్టొచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
నేడు జేఈఈ అడ్వాన్స్డ్
-
India News
ఒడిశా దుర్ఘటనతో 90 రైళ్ల రద్దు.. 46 రైళ్ల దారి మళ్లింపు
-
Movies News
నా మెదడు సీసీ టీవీ ఫుటేజ్ లాంటిది
-
Sports News
రంగు రంగుల రబ్బరు బంతులతో.. టీమ్ఇండియా క్యాచ్‌ల ప్రాక్టీస్
-
Movies News
Kota Srinivas Rao: హీరోల పారితోషికం బయటకు చెప్పటంపై కోట మండిపాటు!
-
Sports News
Sehwag: ఆ ఓటమి బాధతో రెండు రోజులు హోటల్ రూమ్ నుంచి బయటికి రాలేదు: వీరేంద్ర సెహ్వాగ్