జియో ఎయిర్‌ఫైబర్‌ వచ్చేసింది

దిల్లీ: 5జీ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను ‘జియో  ఎయిర్‌ఫైబర్‌’ పేరిట రిలయన్స్‌ జియో మంగళవారం తీసుకొచ్చింది. హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, దిల్లీ, కోల్‌కతా, ముంబయి, పుణె.. ఈ 8 మెట్రో నగరాల్లో ఈ సేవలను ప్రారంభించింది.

Updated : 21 Sep 2023 16:33 IST

హైదరాబాద్‌ సహా 8 నగరాల్లో ప్రారంభం

దిల్లీ: 5జీ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను ‘జియో  ఎయిర్‌ఫైబర్‌’ పేరిట రిలయన్స్‌ జియో మంగళవారం తీసుకొచ్చింది. హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, దిల్లీ, కోల్‌కతా, ముంబయి, పుణె.. ఈ 8 మెట్రో నగరాల్లో ఈ సేవలను ప్రారంభించింది. గత నెలలో జరిగిన రిలయన్స్‌ 46వ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం)లో జియో ఎయిర్‌ఫైబర్‌ సేవలను తీసుకురానున్నట్లు కంపెనీ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే. జియో ఎయిర్‌ఫైబర్‌తో కోట్లాది కుటుంబాలు ప్రపంచస్థాయి డిజిటల్‌ వినోదం, బ్రాడ్‌బ్యాండ్‌, స్మార్ట్‌ హోమ్‌ సేవలను పొందుతాయని రిలయన్స్‌ జియో వెల్లడించింది. ఇప్పటికే జియోఫైబర్‌తో కోటి మందికి పైగా వినియోగదారులకు సేవలు అందిస్తున్నామని, ప్రతినెలా లక్షలాది మంది ఖాతాదారులు చేరుతున్నారని, జియో ఎయిర్‌ఫైబర్‌తో మరిన్ని గృహాలకు చేరువకానున్నట్లు రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ ఛైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ వెల్లడించారు. 550కు పైగా డిజిటల్‌ టీవీ ఛానెళ్లు, 16కు పైగా ఓటీటీ యాప్‌లు, బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు, స్మార్ట్‌హోమ్‌ సేవలు పొందొచ్చన్నారు.

పథకాలు 6, 12 నెలల కాలవ్యవధితో లభిస్తున్నాయి. ప్లాన్‌ ధరకు జీఎస్‌టీ అదనంగా చెల్లించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని