ప్రతి దీవీ.. పర్యాటక దివిటీ!

దేశీయ పర్యాటక అభివృద్ధికి కంకణం కట్టుకున్నట్లు  నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ముఖ్యంగా లక్షద్వీప్‌, ఇతర దీవులను పర్యాటకంగా సిద్ధం చేయనున్నట్లు ప్రకటించారు.

Updated : 02 Feb 2024 05:43 IST

లక్షద్వీప్‌తో సహా దేశీయ పర్యాటకానికి ప్రోత్సాహం

దిల్లీ: దేశీయ పర్యాటక అభివృద్ధికి కంకణం కట్టుకున్నట్లు  నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ముఖ్యంగా లక్షద్వీప్‌, ఇతర దీవులను పర్యాటకంగా సిద్ధం చేయనున్నట్లు ప్రకటించారు. మౌలిక వసతులు, పోర్టుల అనుసంధానం, సౌకర్యాల కల్పనకు ఊతం ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

కేంద్ర మంత్రి ఇంకేమన్నారంటే..

  • పర్యాటక ప్రాంతాల్లో వసతులు, సేవల ఆధారంగా వాటికి రేటింగ్‌ ఇస్తాం. ఇందుకు ఫ్రేమ్‌వర్క్‌ రూపొందిస్తాం.
  • ఆయా కేంద్రాల అభివృద్ధికి రాష్ట్రాలను కలుపుకొని ఆర్థికంగా చేయూత ఇస్తాం.
  • వడ్డీ లేని దీర్ఘకాలిక రుణాలతో రాష్ట్రాలను పర్యాటకరంగం వైపు దృష్టిసారించేలా ప్రోత్సహిస్తాం.
  • దేశీయంగా లక్షద్వీప్‌ వంటి దీవుల్లో పోర్టు కనెక్టివిటీ, ఇన్‌ఫ్రా టూరిజం ఏర్పాటు చేస్తాం. ఫలితంగా ఉద్యోగాలు సృష్టించినట్లవుతుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు