Electric Bike: ఒక ఛార్జింగ్‌తో 100 కిలోమీటర్ల ప్రయాణం

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎంఎల్‌ఆర్‌ మోటార్స్‌ విద్యుత్తు స్కూటర్ల విభాగంలోకి అడుగుపెట్టింది.

Updated : 29 Jul 2022 03:54 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎంఎల్‌ఆర్‌ మోటార్స్‌ విద్యుత్తు స్కూటర్ల విభాగంలోకి అడుగుపెట్టింది. ఒకసారి ఛార్జి చేస్తే 100 కిలోమీటర్లు ప్రయాణించేలా ‘ఎంఎల్‌ఆర్‌ 25’ ఇ-స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఈ వాహనాలను ఓన్లీ ఎలక్ట్రిక్‌ సొల్యూషన్స్‌ ద్వారా దేశీయ విపణిలో విక్రయించనున్నట్లు ఎంఎల్‌ఆర్‌ మోటార్స్‌ ఎండీ ఎం.లోకేశ్వరరావు వెల్లడించారు. సైడ్‌ స్టాండ్‌ సేఫ్టీ సిస్టమ్‌, 60 వేల కిలోమీటర్ల సామర్థ్యం గల బ్యాటరీ, మల్టీ కలర్‌ డిజిటల్‌ డిస్‌ప్లే, రివర్స్‌ ఆప్షన్‌, రిమోట్‌ స్టార్ట్‌ వంటి సదుపాయాలు ఈ స్కూటర్లో ఉన్నాయని తెలిపారు. ఇంజిన్లో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినా, తాత్కాలికంగా స్కూటర్‌ పనిచేసే ప్రత్యామ్నాయ వ్యవస్థను ఇందులో పొందుపరచినట్లు తెలిపారు. మూడు రంగుల్లో ఈ స్కూటర్లు అందిస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం నెలకు 200 వాహనాలు ఉత్పత్తి చేస్తున్నామని, మూడేళ్లలో 6000 వాహనాలు ఉత్పత్తి చేసే స్థాయికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నామని లోకేశ్వరరావు అన్నారు. త్వరలో ఇ-రిక్షా కూడా ఆవిష్కరిస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని