డ్రైవ్ సింక్ కావటం లేదా?
డాక్యుమెంట్లు, ఫొటోలు, వీడియోల వంటి ఫైళ్లను ఎక్కడైనా చూసుకోవటానికి గూగుల్ డ్రైవ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే కొన్నిసార్లు ఇది విండోస్‌కు సింక్ కాకుండా ఇబ్బంది పెడుతుంది
డాక్యుమెంట్లు, ఫొటోలు, వీడియోల వంటి ఫైళ్లను ఎక్కడైనా చూసుకోవటానికి గూగుల్ డ్రైవ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే కొన్నిసార్లు ఇది విండోస్‌కు సింక్ కాకుండా ఇబ్బంది పెడుతుంది. మరి దీన్ని పరిష్కరంచుకోవటమెలా?
కంప్యూటర్‌ను రీస్టార్ట్ చేస్తే విండోస్‌కు సంబంధించిన చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. విండోస్ ప్రోగ్రామ్ క్రాష్ అయినా, కంప్యూటర్ తెర ఫ్రీజ్ అయినా దీంతో తొలగిపోతాయి. అలాగే గూగుల్ డ్రైవ్, వన్‌డ్రైవ్ వంటి క్లౌడ్ స్టోరేజీ యాప్‌ల సమస్యలూ పరిష్కారమవుతాయి.
* డ్రైవ్ సెటప్ అయ్యే క్రమంలో గూగుల్ ఖాతా సరిగా అనుసంధానం కాకపోయినా సింకింగ్ ఎర్రర్లు తలెత్తొచ్చు. కాబట్టి డ్రైవ్‌లో ఏవైనా ఫైళ్లను మోడిఫై చేయటానికి వీలు కాకపోతే గూగుల్ ఖాతాకు తిరిగి కనెక్ట్ కావటం మంచిది. అయితే ముందుగా గూగుల్ డ్రైవ్ ప్రిఫరెన్సెస్ నుంచి దీన్ని డిస్‌కనెక్ట్ చేయాలని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత స్టార్ట్ మెనూ నుంచి గూగుల్ డ్రైవ్‌ను ఓపెన్ చేసి.. బ్రౌజర్‌తో సైన్ ఇన్ కావాలి.
* కొన్నిసార్లు గూగుల్ ఖాతకు రీకనెక్ట్ అయినా డ్రైవ్ సింక్ కాకపోవచ్చు. ఇలాంటిప్పుడు విండోస్‌లో తాత్కాలిక ఫైళ్లను తొలగించుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్‌లోని అన్ని ఫైళ్లు సజావుగా పనిచేయటానికి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తాత్కాలిక ఫైళ్లను సృష్టించుకుంటుంది. అయితే కొన్నిసార్లు ఇవి కరప్ట్ కావొచ్చు. దీంతో పోగ్రామ్‌లు సరిగా పనిచేయవు. కాబట్టి టెంపరరీ ఫైళ్లను తొలగించుకుంటే మంచిది.
* అన్నీ సజావుగానే ఉన్నా సింకింగ్ కావటం లేదంటే ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఒకసారి తనిఖీ చేసుకోవాలి. ఇంటర్నెట్ కనెక్షన్ బలహీనంగా ఉంటే సింకింగ్‌తో పాటు చాలా సమస్యలు ఎదురవుతాయి. డీఎన్‌ఎస్ క్యాచీని క్లియర్ చేసుకుంటే ఇంటర్నెట్‌కు సంబంధించిన సమస్యలను చాలావరకు తొలగించుకోవచ్చు. కమాండ్ ప్రాంప్ట్‌ను ఓపెన్ చేసి, ipconfig /flushdnsఅని టైప్ చేయాలి. తర్వాత ఎంటర్ బటన్‌ను నొక్కాలి. దీంతో డీఎన్‌ఎస్ క్యాచీ క్లియర్ అవుతుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
APSRTC: శ్రీశైలం వెళ్లే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ
-
Sports News
Asia Cup 2023: ‘వారు నరకానికి పోవాలనుకోవడం లేదు’’..: వెంకటేశ్ ప్రసాద్
-
General News
KTR: హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్
-
General News
Supreme Court: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. అత్యవసర విచారణకు సీజేఐకి విజ్ఞప్తి
-
World News
Mumbai terror attacks: 2008 ఉగ్రదాడి గాయం గుర్తులు ఇంకా మానిపోలేదు: అమెరికా
-
Politics News
Balasaheb Thorat: మహారాష్ట్రలో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్.. పార్టీ పదవికి థోరట్ రాజీనామా!