Income Tax: కొత్త పన్ను విధానానికి భారీ స్పందన వచ్చే అవకాశం: సీబీడీటీ చీఫ్‌

ఆదాయ పన్ను విధానం పునరుద్దరణతో చాలామందికి ప్రయోజనం కలుగుతుందని సీబీడీటీ (CBDT) ఛీప్‌ నితిన్‌గుప్తా (Nitin Gupta) అన్నారు. అయితే ఆదాయ పన్ను తగ్గింపులను క్లెయిమ్ల్‌ చేయలేని వారికి  కొత్త పన్ను విధానం ప్రయోజనకరం అని తెలిపారు.

Published : 03 Feb 2023 19:34 IST

దిల్లీ: సవరించిన కొత్త ఆదాయపు పన్ను విధానం వల్ల పన్నుచెల్లింపుదారులకు ప్రయోజనకరమని సీబీడీటీ (CBDT) ఛైర్మన్‌ నితిన్‌గుప్తా (Nitin Gupta) అన్నారు. ఇందులో మార్పుల వల్ల ఈసారి అద్భుతమైన స్పందన వస్తుందని ప్రభుత్వం ఆశాభావంతో ఉందన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్‌లో (Budget 2023) కొత్త పన్ను విధానంలో శ్లాబులను సవరించారు. వార్షిక ఆదాయం రూ.7లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండదని వెల్లడించారు. దీంతో పాటు రూ.50 వేల వరకు ప్రామాణిక తగ్గింపు ఉంటుందని చెప్పారు.

‘‘సవరించిన కొత్త ఆదాయ పన్ను విధానం ద్వారా పన్నుదారులకు లబ్ది చేకూరుతుంది. కొత్త పన్ను విధానం తీసుకున్న వారికి రూ.50 వేల వరకు ప్రామాణిక తగ్గింపు ఉంటుంది. దీంతో వార్షిక ఆదాయం రూ.7.50 లక్షల వరకు ఎటువంటి పన్నూ ఉండదు. ఆదాయన పన్ను తగ్గింపులను క్లెయిమ్‌ చేయటానికి తగినంత పెట్టుబడులు లేని వారికి కొత్త పన్ను విధానం ప్రయోజనకరంగా ఉంటుంది’’ అని నితిన్‌ గుప్తా పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని