GST Council: 17న జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం.. ఆన్‌లైన్‌ గేమింగ్‌పై చర్చ!

జీఎస్టీ కౌన్సిల్‌ తదుపరి సమావేశ తేదీ ఖరారైంది. డిసెంబర్‌ 17న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో 48వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది.

Published : 26 Nov 2022 13:14 IST

దిల్లీ: జీఎస్టీ కౌన్సిల్‌  (GST Council) తదుపరి సమావేశ తేదీ ఖరారైంది. డిసెంబర్‌ 17న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో 48వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. 47వ సమావేశం చండీగఢ్‌లో జరగ్గా.. తదుపరి సమావేశం మాత్రం వర్చువల్‌గానే జరగనుంది. ఈ విషయాన్ని శుక్రవారం రాత్రి జీఎస్టీ కౌన్సిల్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది.

గత జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో కొన్ని రేట్ల పెంపు నిర్ణయాలు వెలువడ్డాయి. ఎల్‌ఈడీ బల్బులు, సోలార్‌ వాటర్‌ హీటర్లు, మెటల్‌ ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డులపై 12 శాతంగా ఉన్న జీఎస్టీ 18 శాతానికి పెంచారు. టెట్రా ప్యాకెట్లపై జీఎస్టీని సైతం 18 శాతానికి పెంచారు. పెరిగిన రేట్లు జులై 18 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ సారి మాత్రం ఆన్‌లైన్‌ గేమింగ్‌, కేసినోపై జీఎస్టీ 28 శాతానికి పెంపు అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది. మేఘాలయ సీఎం కన్రాడ్‌ సంగ్మా నేతృత్వంలోని మంత్రుల బృందం దీనిపై త్వరలోనే జీఎస్టీ కౌన్సిల్‌కు నివేదిక సమర్పించే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు