HDFC బ్యాంక్‌ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. క్రెడిట్‌ కార్డుతో UPI చెల్లింపులు

HDFC Bank-UPI: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వినియోగదారులు ఇకపై యూపీఐ చెల్లింపుల కోసం రూపే క్రెడిట్‌ కార్డులను వినియోగించుకోవచ్చు. ఈ సేవలు తీసుకొచ్చిన తొలి ప్రైవేటు బ్యాంకు ఇదే.

Published : 16 Feb 2023 19:20 IST

దిల్లీ: ప్రైవేటు రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (HDFC bank) తమ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. రూపే క్రెడిట్‌ (Rupay credit card) కార్డు కలిగిన వినియోగదారులు ఇకపై BHIM లేదా ఇతర యాప్స్‌ ద్వారా UPI చెల్లింపులు చేయొచ్చని తెలిపింది. ఈ సేవలను ప్రారంభించిన తొలి ప్రైవేటు రంగ బ్యాంక్‌ తమదేని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఓ ప్రకటనలో తెలిపింది. రూపే క్రెడిట్‌ కార్డుల ద్వారా యూపీఐ చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆర్‌బీఐ ఇది వరకే పేర్కొన్న సంగతి తెలిసిందే.

రూపే క్రెడిట్‌ కార్డులను యూపీఐ నెట్‌వర్క్‌కు లింక్‌ చేయడం ద్వారా డిజిటల్‌ పేమెంట్స్‌ మరింత సులభతరం కానున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ పేమెంట్స్‌ హెడ్‌ పరాగ్‌ రావు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ విధానం డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థలో గేమ్‌ ఛేంజర్‌ కానుందని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ (NPCI) సీఓఓ ప్రవీణ్‌ రాయ్‌ పేర్కొన్నారు. క్యూఆర్‌ కోడ్‌తో ఎక్కడైనా చెల్లింపులు చేసేటప్పుడు బ్యాంక్‌ అకౌంట్‌ మాదిరిగా ఇకపై క్రెడిట్‌ కార్డును ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు. ఎస్‌బీఐ కార్డ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ సైతం త్వరలో రూపే క్రెడిట్‌ కార్డుతో యూపీఐ చెల్లింపుల సేవలను తీసుకొచ్చే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని