HDFC Bank: అదరగొట్టిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌.. లాభంలో 34% వృద్ధి

HDFC Bank Q3 results: ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసిక ఫలితాలను మంగళవారం ప్రకటించింది.

Updated : 16 Jan 2024 19:05 IST

HDFC Bank | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రైవేటురంగ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ (HDFC Bank) త్రైమాసిక ఫలితాలను (Q3 results) మంగళవారం ప్రకటించింది. డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో స్టాండర్డ్‌లోన్‌ పద్ధతిన రూ.16,373 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.12,259 కోట్లతో పోలిస్తే 34 శాతం వృద్ధి నమోదైంది. బ్యాంకు మొత్తం ఆదాయం సైతం రూ.51,208 కోట్ల నుంచి రూ.81,720 కోట్లకు పెరిగింది.

జియో రిపబ్లిక్‌ డే ఆఫర్‌.. ఏడాది ప్లాన్‌పై స్విగ్గీ, అజియో కూపన్లు

ఏకీకృత ప్రాతిపదికన బ్యాంకు లాభం 39 శాతం పెరిగి రూ.17,718 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ.1,15,015 కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.54,123 కోట్లుగా నమోదైంది. బ్యాంకు నికర వడ్డీ ఆదాయం (NII) 23.9 శాతం పెరిగి రూ.28,470 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో వడ్డీ ఆదాయం రూ.22,990 కోట్లుగా ఉంది. స్థూల నిరర్థక ఆస్తులు (GNPA) 1.23 శాతం నుంచి 1.26 శాతానికి చేరగా.. నికర నిరర్థక ఆస్తులు 0.33 శాతం నుంచి 0.31 శాతానికి తగ్గినట్లు బ్యాంక్‌ పేర్కొంది. బ్యాంక్‌ మొత్తం డిపాజిట్లు 27.7 శాతం పెరిగి 28.47 లక్షల కోట్లకు చేరినట్లు వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు బీఎస్‌ఈలో 0.42 శాతం పెరిగి రూ.1678.95 వద్ద ముగిశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని