Health Insurance: ఆరోగ్య బీమా పాలసీ రైడర్‌ల ప్రీమియంలు ఎంతెంత?

ఆరోగ్య బీమాకు అదనంగా రైడర్స్‌ జోడించడం వల్ల అనేక ప్రయోజనాలుంటాయి. వివిధ రైడర్ల ప్రీమియం ఎంతెంత అనేది ఇక్కడ చూడొచ్చు.

Updated : 09 Oct 2023 18:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆరోగ్య బీమాను కోనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనం అందరికీ తెలిసిందే. పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చుల కారణంగా ఈ రోజుల్లో ఆరోగ్య బీమా పాలసీ తప్పనిసరి. అన్ని వైద్య ఖర్చులనూ కవర్‌ చేయడానికి ప్రాథమిక ఆరోగ్య బీమా పథకం ఒక్కటే సరిపోకపోవచ్చు. ఇందుకుగానూ రైడర్లను, యాడ్‌-ఆన్‌లను జోడించడం ద్వారా మీ ప్రాథమిక పాలసీ కవరేజీని విస్తరించొచ్చు. రైడర్లకు అదనపు ప్రీమియం చెల్లిస్తే.. చెల్లించిన అదనపు ప్రీమియం మొత్తానికి పన్ను ప్రయోజనాలు వర్తిస్తాయి. పాలసీదారులు తమ ప్రాథమిక ఆరోగ్య బీమాను కొనుగోలు చేసే సమయంలో రైడర్లను ఎంచుకోవచ్చు. రైడర్‌ను కొనుగోలు చేయడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. అందువల్ల పాలసీదారుడిపై ఆర్థిక భారం ఎక్కువగా పడదు. ఐఆర్‌డీఏఐ మార్గదర్శకాల ప్రకారం.. రైడర్‌ ధర బేస్‌ పాలసీ ప్రీమియంలో 30% కంటే ఎక్కువ ఉండకూడదు. ఉదాహరణకు మీ బేస్‌ పాలసీ ప్రీమియం రూ.10,000 అయితే, రైడర్‌ ప్రీమియం రూ.3000 మించకూడదు. ఆరోగ్య బీమా రైడర్ల ప్రీమియం ఎంత అనేది ఇక్కడ చూద్దాం..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు