Home Loan: క‌్రెడిట్ స్కోర్‌ని బ‌ట్టి గృహ రుణ వ‌డ్డీ రేట్లు

క్రెడిట్ స్కోర్ మెరుగుగా నిర్వ‌హించేవారికి బ్యాంకులు అతి త‌క్కువ గృహ రుణ వ‌డ్డీ రేట్ల‌కు రుణాలందిస్తున్నాయి.

Published : 12 Jul 2022 15:17 IST

గృహ రుణం, అందుబాటులో ఉన్న రుణాల‌లో చౌకైన రుణం. దీర్ఘ‌కాలం పాటు ఉండే రుణాల‌లో ఇంటి రుణం ఒక‌టి. గృహ రుణాన్ని `మంచి లోన్' అని పిలుస్తారు. ఎందుకంటే ఇది దీర్ఘ‌కాలికంగా అభినందించ‌గ‌ల స్ప‌ష్ట‌మైన ఆస్తిని సంపాదించ‌డానికి మీకు స‌హాయ‌ప‌డుతుంది. అంతే కాకుండా వార‌సుల‌కు ఆస్తి ఇస్తుంది. క్రెడిట్ స్కోర్ మెరుగుగా నిర్వ‌హించేవారికి ఇంటి కొనుగోలుకు, నిర్మాణానికి కొన్ని ప్ర‌ముఖ బ్యాంకులు అతి త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌కు గృహ రుణాలందిస్తున్నాయి. 

750 అంత‌క‌న్నా ఎక్కువ‌ క్రెడిట్ స్కోర్ మీకు త‌క్కువ వ‌డ్డీ రేటుతో వేగంగా రుణం అంద‌డానికి స‌హాయం చేయ‌డ‌మే కాకుండా, బ్యాంకు రుణ మొత్తాన్ని త్వ‌ర‌గా ప్రాసెస్ చేసి, రుణ పంపిణీ అయ్యేలాగా చేస్తుంది. కాబ‌ట్టి, మీ క్రెడిట్ స్కోర్‌ని త‌నిఖీ చేయండి. గృహ రుణం కోసం అప్లై చేసేముందు క్రెడిట్ స్కోర్‌ని పెంచుకోవ‌డానికి, అప్ప‌టికే ఉన్న అన్ని రుణ బ‌కాయిల‌ను తీర్చేయ‌డానికి ప్ర‌య‌త్నించండి.

700 నుండి 800 అంత‌కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న‌వారికి వివిధ బ్యాంకుల గృహ రుణ వ‌డ్డీ రేట్లు ఈ క్రింది ప‌ట్టిక‌లో ఉంది.

గ‌మ‌నిక: క్రెడిట్ స్కోర్‌తో ఆధారిత గృహ రుణ వ‌డ్డీ రేటు ను ఈ ప‌ట్టిక చూపిస్తుంది. వ‌డ్డీ రేటు సూచిక మాత్ర‌మే. ఒక వ్య‌క్తి ప‌నిచేసే సంస్థ‌, బ్యాంక్ నిబంధ‌న‌లు, ఇతర ష‌ర‌తుల‌పై ఆధార‌ప‌డి వ‌డ్డీ రేటు మార‌వ‌చ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని