Cyber fraud alert: లింక్‌ క్లిక్‌ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్‌ మూలాలు చెక్‌ చేయండి..

మొబైల్‌లో వచ్చిన మెసేజ్‌ను హెడ్డర్‌ సాయంతో ఎవరు పంపారో ఇట్టే కనిపెట్టేయొచ్చు. అదెలాగంటే..?

Updated : 18 Apr 2024 15:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రెడిట్‌ కార్డ్‌ ఆఫర్లు, రివార్డ్‌ పాయింట్లు, కేవైసీ అప్‌డేట్లు అంటూ తరచూ మన ఫోన్‌కు మెసేజ్ లు వస్తుంటాయి. రివార్డ్‌ పాయింట్లు క్లెయిం చేసుకోండి. ఈరోజే లాస్ట్‌. అంటూ వాటిలో కొన్ని లింక్‌లు కూడా ఉంటాయి. నిజంగా ఆ సంస్థే పంపించిందా అన్నట్లుగా ఆ సందేశాలు కనిపిస్తాయి. పొరపాటున అవి నిజమే అనుకుని నమ్మి ఆ లింక్‌ క్లిక్‌ చేస్తే సైబర్‌ నేరగాళ్ల వలకు చిక్కినట్లే.

బ్యాంక్‌లు, ఫైనాన్స్‌ సంస్థలు.. ఇలా అనేక కంపెనీల హెడ్డర్లతో సైబర్‌ నేరగాళ్లు ఈతరహా మోసాలకు పాల్పడుతున్నారు. హెడ్డర్‌ గురించి అవగాహన లేనివారు సులువుగా వారి బారిన పడుతున్నారు. దీంతో సైబర్‌ దాడులకు సంబంధించి ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ, సూచనలు జారీ చేసే కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే సైబర్‌ దోస్త్‌ (Cyber Dost) అప్రమత్తమైంది. ఇకపై మెసేజ్‌లు ఎక్కడినుంచి వచ్చాయో తెలుసుకొనేందుకు ఓ టిప్‌ను తాజాగా ‘ఎక్స్‌’ వేదికగా పంచుకుంది.

ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?

ఏమిటీ హెడ్డర్‌..?

మనకొచ్చే ఎస్సెమ్మెస్‌లను పరిశీలిస్తే.. తొలుత రెండు అక్షరాలు, తర్వాత మరో 6 క్యారెక్టర్లు (AB-CDEFGH) ఉంటాయి. దీన్నే హెడ్డర్‌ అంటారు. తొలి రెండు అక్షరాలు టెలికాం నెట్‌వర్క్‌ను, తర్వాతి 6 క్యారెక్టర్లు పంపిన సంస్థను సూచిస్తాయి. దీని ఆధారంగానే మెసేజ్‌ ఓపెన్‌ చేయకుండానే ఆ సందేశం ఎక్కడినుంచి వచ్చిందో తెలుసుకోవచ్చు. అయితే, ఏదైనా మెసేజ్‌ వచ్చినప్పుడు ఆ సందేశం అసలుదా? నకిలీదా అని తెలుసుకునే వీలుంది. మీ మొబైల్‌కు వచ్చే హెడ్డర్‌ను DETAILS OF XXXX అని టైప్‌ చేసి 1909కి మెసేజ్‌ పంపితే చాలు. వెంటనే ఆ కంపెనీకి సంబంధించిన అన్ని వివరాలు ఎస్సెమ్మెస్‌ రూపంలో వచ్చేస్తాయి. ఇలా సులువుగా మెసేజ్‌ ఎక్కడినుంచి వచ్చిందో తెలుసుకోవచ్చన్నమాట. ఇకపై క్లెయిం, రివార్డులు అని వచ్చే లింక్‌లపై క్లిక్‌ చేసే ముందు ఒకసారి చెక్‌ చేయడం ఉత్తమం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని