Russian oil: ఆల్‌టైమ్‌హైకి రష్యా క్రూడ్‌.. IOCనే ప్రధాన కొనుగోలుదారు

Russian oil imports: రష్యా చమురు దిగుమతులు రికార్డు స్థాయికి పెరిగాయి. జూన్‌ నెలలో ఇది 2.2 మిలియన్‌ బ్యారెళ్లకు చేరింది. ఇందులో ఐఓసీనే అతిపెద్ద కొనుగోలుదారుగా ఉంది.

Updated : 03 Jul 2023 15:52 IST

దిల్లీ: దేశంలోకి రష్యా ముడి చమురు (Russian oil imports) దిగుమతులు రికార్డు స్థాయికి చేరాయి. గడిచిన కొన్ని నెలలుగా దిగుమతులను అంతకంతకూ పెంచుకుంటూ వస్తున్న భారత్‌ (India).. జూన్‌లోనూ ఆ ఒరవడిని కొనసాగించింది. ఏకంగా రోజుకు 2.2 మిలియన్ బ్యారెళ్ల చమురును భారత్‌ దిగుమతి చేసుకున్నట్లు ప్రముఖ డేటా అనలాసిస్‌ సంస్థ Kpler పేర్కొంది.

ఏళ్లుగా మధ్యప్రాచ్య దేశాల నుంచే భారత్‌ ఎక్కువగా చమురును దిగుమతి చేసుకునేది. ఉక్రెయిన్‌పై యుద్ధం అనంతరం చౌక ధరకే చమురును విక్రయించడం మొదలు పెట్టాక రష్యా నుంచి భారత్‌ తన దిగుమతులను పెంచుకుంటూ వస్తోంది. దేశంలోకి చమురు దిగుమతుల్లో ఒకప్పుడు 2 శాతంగా ఉన్న రష్యా వాటా మే నెలలో 46 శాతానికి చేరింది. తాజాగా జూన్‌ నెలలో సౌదీ అరేబియా, ఇరాక్‌ దేశాలు భారత్‌కు చేసే ఎగుమతుల కంటే రష్యా క్రూడ్‌ ఎగుమతులే అధికం కావడం గమనార్హం.

ఇప్పటికే రష్యా నుంచి క్రూడ్‌ దిగుమతులు పీక్‌కు చేరిన నేపథ్యంలో ఇంతకుమించి పెరగకపోవచ్చని విశ్లేషకులు చెప్తున్నారు. దీనికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అడ్డంకులతో పాటు ఇతర చమురు సరఫరా దేశాలతోనూ మంచి సంబంధాలు కొనసాగించడమూ కారణమని అంటున్నారు. రష్యా చమురు సప్లయ్‌ తగ్గుముఖం పట్టడం వల్ల వచ్చే నెల దిగుమతులు తగ్గే అవకాశం ఉందనీ భావిస్తున్నారు. రష్యా క్రూడ్‌ కొనుగోలు చేస్తున్న సంస్థల్లో ప్రభుత్వ రంగ సంస్థ ఇండియా ఆయిల్‌ కార్పొరేషన్‌ అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో రిలయన్స్‌ ఉందని Kpler పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని