Corporate FDs: కంపెనీ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఎంతెంత?

వివిధ NBFCలు..డిపాజిట్లపై ఇస్తున్న వడ్డీ రేట్లను ఇక్కడ చూడండి.

Published : 31 Jul 2023 18:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాలా మంది తమ పెట్టుబడులపై తగిన రాబడిని సంపాదించడానికి వివిధ మదుపు పథకాలను ఆశ్రయిస్తుంటారు. బ్యాంకులు, పోస్టాఫీసులే కాకుండా వివిధ NBFC (నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ)లు కూడా డిపాజిట్లను సేకరిస్తున్నాయి. ఈ డిపాజిట్ల కాలవ్యవధి ఏడాది నుంచి 5 ఏళ్లు. వడ్డీ రేట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే 1-1.50% అధికంగానే ఉంటున్నాయి. అంతేకాకుండా సీనియర్‌ సిటిజన్ల డిపాజిట్లపై 0.25-0.50% వరకు వడ్డీని అదనంగా ఆఫర్‌ చేస్తున్నాయి. ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంకులు పత్యేక కాలవ్యవధి డిపాజిట్లపై 7% దాటి వడ్డీనిస్తుండగా, కంపెనీ డిపాజిట్లు గరిష్ఠంగా 5 ఏళ్లకు 8.18% వరకు కూడా వడ్డీని అందజేస్తున్నాయి. అయితే వీటిలో డిపాజిట్లు చేసేటప్పుడు వాటి క్రెడిట్‌ రేటింగ్‌లను తప్పక చూడాలి. 'AAA' రేటింగ్‌ ఉన్న కంపెనీ డిపాజిట్లకు గ్యారెంటీ ఎక్కువని నిపుణుల అభిప్రాయం.

వివిధ NBFCలు తమ ఎఫ్‌డీలపై ఎంతెంత వడ్డీని ఆఫర్‌ చేస్తున్నాయో కింది పట్టికలో చూడండి..

కంపెనీ ఎఫ్‌డీలు సరైనవేనా?

కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రత్యేక కాలవ్యవధి గల ఎఫ్‌డీలపై 7%కు పైగా వడ్డీ ఇస్తున్నాయి. కార్పొరేట్‌ ఎఫ్‌డీలకు ప్రత్యామ్నాయంగా పెట్టుబడిదారులు 8%, ఇంతకంటే ఎక్కువ వడ్డీ రేట్లను అందించే స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల్లో మదుపు చేయొచ్చు. ఈ బ్యాంకుల ఎఫ్‌డీలపై కూడా డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌ (DICGC) కింద రూ.5 లక్షల వరకు (వడ్డీతో కలిపి) కవరేజీ ఉంటుంది. కంపెనీ డిపాజిట్లకు బ్యాంకుల మాదిరిగా DICGC బీమా సౌకర్యం ఉండదు. కాబట్టి బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే కంపెనీ (NBFC) డిపాజిట్లు ఎక్కువ రిస్క్‌ని కలిగి ఉంటాయని గుర్తుంచుకోవాలి. వీటిలో పెట్టుబడి పెట్టే ముందు కంపెనీ క్రెడిట్‌ రేటింగ్‌, ఆర్థిక స్థిరత్వాన్ని చెక్‌ చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని