ITR Filing: ఆధార్‌-పాన్‌ లింక్‌ చేయకపోయినా ఐటీఆర్‌ ఫైల్‌ చేయొచ్చు

ఆధార్‌తో మీ పాన్‌ లింక్‌ చేయని వారికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ ఒక కీలక ప్రకటన చేసింది.

Updated : 30 Jul 2023 06:44 IST

పాన్‌-ఆధార్‌ లింక్‌ చేయకపోతే పాన్ కార్డు నిరుపయోగ స్థితి(ఇన్-ఆపరేటివ్)కి చేరుకుంటుంది. ఇలాంటి పా కార్డు గలవారు కూడా ఐటీఆర్‌ ఫైల్‌ చేయవచ్చని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఐటీఆర్‌ ఫైల్‌ చేయడానికి చివరి తేది 2023, జులై 31. అయితే, మీరు ఫైల్‌ చేసిన ఐటీఆర్‌ని వెరిఫై చేయాలని గుర్తుంచుకోండి. ఆదాయపు పన్ను చట్టాలు ఒక వ్యక్తి దాఖలు చేసిన ఐటీఆర్‌ని ధ్రువీకరించడానికి 30 రోజుల వరకు సమయాన్ని అనుమతిస్తాయి. దాఖలు చేసిన ఐటీఆర్‌ 30 రోజుల లోపు ధ్రువీకరించకపోతే ఆ వ్యక్తి ఐటీఆర్‌ దాఖలు చేయనట్టుగా ఆదాయపు పన్ను శాఖ పరిగణిస్తుంది. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఇ-ఫైలింగ్‌ పోర్టల్‌ ఒక వ్యక్తి ఇన్-ఆపరేటివ్ పాన్‌తో ఐటీఆర్‌ ఫైల్‌ చేసే సమయంలో పన్ను చెల్లించడానికి కూడా అనుమతిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు