MEIL: మేఘా చేతికి మంగోలియా ఆయిల్‌ రిఫైనరీ ప్రాజెక్ట్‌

తూర్పు ఆసియా దేశమైన మంగోలియాలో గ్రీన్‌ఫీల్డ్‌ ఆయిల్‌ రిఫైనరీ ప్రాజెక్ట్ నిర్మించే బాధ్యత మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ లిమిటెడ్‌ (MEIL)కు దక్కింది.

Published : 03 Nov 2022 22:50 IST

దిల్లీ:  మంగోలియాలో గ్రీన్‌ఫీల్డ్‌ ఆయిల్‌ రిఫైనరీ ప్రాజెక్ట్ నిర్మించే బాధ్యత మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ లిమిటెడ్‌ (MEIL)కు దక్కించుకుంది. మంగోలియాలో నిర్మిస్తున్న తొలి రిఫైనరీ కర్మాగారం ఇదే. 790 మిలియన్‌ డాలర్ల విలువైన ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి సంబంధించి ఎల్‌ఓఏ అందుకున్నట్లు ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రిఫైనరీ నిర్మాణం వల్ల రష్యా నుంచి ఆయిల్‌ దిగుమతులు తగ్గించుకోవడంతో పాటు, పెట్రోలియం ఉత్పత్తుల అవసరాలను తీర్చుకోవడానికి ఆ దేశానికి వీలు పడుతుందని పేర్కొంది.

రిఫైనరీ ఆపరేషన్స్‌లో భాగంగా పైప్‌లైన్‌, పవర్‌ ప్లాంట్‌ కూడా నిర్మించనున్నారు. ఒకసారి ఈ రిఫైనరీ అందుబబాటులోకి వచ్చాక రోజుకు 30 వేల బ్యారెళ్ల క్రూడాయిల్‌ను ఈ కర్మాగారంలో శుద్ధి చేయడానికి వీలు పడుతుంది. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభివృద్ధి భాగస్వామ్యంలో భాగంగా, భారత ప్రభుత్వ ఆర్థిక సహకారంతో మంగోలియా ప్రభుత్వం ఈ రిఫైనరీ నిర్మాణం చేపడుతోంది. ఈ ప్రాజెక్ట్‌ వల్ల భారత్‌- మంగోలియా బంధం బలపడడంతో పాటు హైడ్రోకార్బన్‌ రంగంలో కంపెనీ విస్తరణకు దోహదపడుతుందని కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. ఇంధనం విషయంలో మంగోలియా ఇతర దేశాలపై ఆధారపడడం తగ్గడమే కాకుండా.. ఆ దేశ ఆర్థిక పరిపుష్టికి ఈ ప్రాజెక్ట్‌ దోహదం చేయనుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని