Jet Airways: జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవహారంలో కీలక పరిణామం

Jet Airways: జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్‌సీఎల్‌టీ ఇచ్చిన తీర్పును అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ సమర్థించింది.

Published : 12 Mar 2024 18:48 IST

Jet Airways | దిల్లీ: ఆర్థికంగా కుదేలైన జెట్‌ ఎయిర్‌వేస్‌ (Jet Airways) వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. జెట్‌ ఎయిర్‌వేస్ యాజమాన్య హక్కుల బదిలీ విషయంలో గతంలో నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (NCLT) ఇచ్చిన తీర్పును అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (NCLAT) సమర్థించింది. దివాలా ప్రక్రియలో విజయవంతం అయిన బిడ్డర్‌గా నిలిచిన జలాన్‌ కర్లాక్‌ కన్సార్షియంకు (JKC) 90 రోజుల్లో హక్కులను బదిలీ చేయాలని మానిటరింగ్‌ కమిటీని ఆదేశించింది. నిర్దేశిత గడువులోగా డీజీసీఏ నుంచి ఎయిర్‌ ఆపరేటర్స్‌ సర్టిఫికెట్‌ పొందాలని జేకేసీకి సూచించింది.

Paytm పేమెంట్స్‌ బ్యాంక్‌లో ఈ సేవలకు.. మరికొన్ని రోజులే గడువు

జెట్‌ ఎయిర్‌వేస్‌ 2019లో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వ్యవహారం నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌కు వెళ్లగా.. దివాలా ప్రక్రియ మొదలైంది. ఇందులో జలాన్- కర్లాక్‌ కన్సార్షియం బిడ్డింగ్‌లో జెట్‌ ఎయిర్‌వేస్‌ను దక్కించుకుంది. యాజమాన్య హక్కుల బదిలీకి ట్రైబ్యునల్‌ ఆదేశించింది. కన్సార్షియానికి, రుణదాతలకు మధ్య విభేదాలు నెలకొన్నాయి. దీంతో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నేతృత్వంలోని రుణదాతలు ఎన్‌సీఎల్‌ఏటీకి (NCLAT) వెళ్లారు. యాజమాన్య హక్కుల బదిలీ విషయంలో ఎన్‌సీఎల్‌టీ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేశారు. ఈనేపథ్యంలో అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ తాజా ఆదేశాలు ఇచ్చింది. రుణదాతలకు తొలివిడతగా చెల్లించాల్సిన రూ.350 కోట్లలో రూ.150 కోట్లు బ్యాంక్‌ గ్యారెంటీని సర్దుబాటు చేసుకోవడానికి జేకేసీకి వెసులుబాటు కల్పించింది. జేకేసీ ఇప్పటికే రూ.200 కోట్లను డిపాజిట్‌ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని