GPT Store: జీపీటీ స్టోర్‌ ప్రారంభం.. అందుబాటులోకి నచ్చిన AI చాట్‌బాట్‌!

GPT Store | యాప్‌స్టోర్‌ తరహాలోనే ఓపెన్‌ఏఐ సంస్థ జీపీటీ స్టోర్‌ను ప్రారంభించింది.

Updated : 11 Jan 2024 13:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ కృత్రిమ మేథ (Artificial Intelligence- AI) సంస్థ ఓపెన్‌ఏఐ బుధవారం జీపీటీ స్టోర్‌ను (GPT Store) ప్రారంభించింది. వివిధ అవసరాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఏఐ చాట్‌బాట్‌లు (AI ChatBot) దీంట్లో అందుబాటులో ఉన్నాయి. డబ్బులు చెల్లించిన సబ్‌స్క్రైబర్లు మాత్రమే దీన్ని ఉపయోగించుకోవచ్చు. బాట్‌ను సృష్టించిన వారు వాటిని స్టోర్‌లో ఉంచి డబ్బు ఆర్జించొచ్చు. ఇది యాప్‌స్టోర్‌ తరహాలోనే పనిచేస్తుంది. ఆదరణను బట్టి అవి యూజర్లకు వరుసక్రమంలో కనిపిస్తాయి.

ఇప్పటి వరకు 30 లక్షల చాట్‌బాట్‌లను యూజర్లు సృష్టించారని ఓపెన్‌ఏఐ (OpenAI) తెలిపింది. వీటిలో ఎన్ని స్టోర్‌లో (GPT Store) అందుబాటులో ఉన్నాయో వెల్లడించలేదు. ఆదాయ మార్గాలను పెంచుకోవడంలో భాగంగానే ఓపెన్‌ఏఐ ఈ జీపీటీ స్టోర్‌ను ప్రారంభించింది. ఆగస్టులో కార్పొరేట్‌ అవసరాల కోసం ప్రత్యేక చాట్‌జీపీటీ వెర్షన్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా చిన్న కంపెనీల కోసం నెలకు 25 డాలర్లతో మరో ప్రత్యేక వెర్షన్‌ను ప్రవేశపెట్టింది.

గత ఏడాది నవంబర్‌లోనే జీపీటీ స్టోర్‌ను (GPT Store) తీసుకురానున్నట్లు ఓపెన్‌ఏఐ (OpenAI) ప్రకటించింది. కానీ, సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ తొలగింపు వివాదం కావటంతో ఆలస్యమైంది. ఇక నుంచి వారానికో కొత్త తరహా జీపీటీని తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని