Reliance Jio: రూ.13 వేల కోట్ల లోన్‌ కోసం జియో చర్చలు!

Reliance Jio: నోకియా ఎక్విప్‌మెంట్‌ కొనుగోలు కోసం కావాల్సిన నిధుల వేటను రిలయన్స్‌ జియో ప్రారంభించింది. ఈ మేరకు వివిధ బ్యాంకులతో చర్చలు ప్రారంభించినట్లు సమాచారం.

Published : 23 Jun 2023 13:20 IST

దిల్లీ: రిలయన్స్‌ జియో (Reliance Jio) ఇన్ఫోకామ్‌ 1.6 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.13 వేల కోట్లు) రుణం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. నోకియా ఎక్విప్‌మెంట్‌ కొనుగోలు నిమిత్తం ఈ నిధులను వినియోగించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పలు బ్యాంకులతో చర్చలు ప్రారంభించినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు వెల్లడించారు. 

సిటీ గ్రూప్‌, హెచ్‌ఎస్‌బీసీ హోల్డింగ్స్‌, జేపీ మోర్గాన్‌ చేజ్‌ వంటి బ్యాంకులతో బిలియనీర్‌ ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani)కి చెందిన జియో ఇన్ఫోకామ్‌ చర్చలు కొనసాగిస్తున్నట్లు సంబంధిత వ్యక్తులు తెలిపారు. దాదాపు 15 ఏళ్ల కాలపరిమితితో రుణాన్ని పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు బ్యాంకులు, జియో మధ్య ఎలాంటి సయోధ్య కుదరలేదని సమాచారం. ఈ నేపథ్యంలో రుణాలిచ్చే బ్యాంకులు, రుణ ఒప్పందాలు ఎప్పుడైనా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై ఇటు జియోగానీ, అటు చర్చల్లో పాల్గొంటున్న బ్యాంకులుగానీ ఇప్పటి వరకు స్పందించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని