Rental Bond: ఇల్లు అద్దెకు తీసుకుంటున్నారా?సెక్యూరిటీ డిపాజిట్ కంటే రెంటల్ బాండ్ మేలు!
Rental Bond: ఇల్లు అద్దెకు తీసుకునేవారు సెక్యూరిటీ డిపాజిట్ భారాన్ని తగ్గించుకోవడానికి రెంటల్ బాండ్ ఒక మేలైన మార్గం. దీని ద్వారా యజమాని, అద్దెదారులకు మధ్య మంచి నమ్మకం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా ఇల్లు అద్దెకు తీసుకునేటప్పుడు కచ్చితంగా ఎంతో కొంత సెక్యూరిటీ డిపాజిట్ కింద యజమానికి ముందే చెల్లించాల్సి ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి ఈ మొత్తం మారుతుంది. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఈ సెక్యూరిటీ డిపాజిట్ సామాన్యులకు పెద్ద భారమనే చెప్పాలి. దీనికి పరిష్కారంగానే రెంటల్ బాండ్స్ (Rental Bond) అనే ప్రత్యేక విధానం అందుబాటులో ఉంది. ఇది యజమానితో పాటు అద్దె తీసుకునే వాళ్లకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
రెంటల్ బాండ్ అంటే..
సులభంగా చెప్పాలంటే యజమానులకు అద్దెకు తీసుకునేవాళ్లు ఇచ్చే ఆర్థిక భరోసానే రెంటల్ బాండ్ (Rental Bond). ఇది భారత్‌లో ఇంకా అంత ప్రాచుర్యం పొందలేదు. వీటిని జారీ చేసేందుకు ప్రత్యేకంగా కంపెనీలు ఉంటాయి. ష్యూరిటీ ప్రొవైడర్లు కూడా వీటిని అద్దె తీసుకునేవారి తరఫున జారీ చేస్తుంటారు. కొంత ఫీజు చెల్లించి వీటిని పొందొచ్చు. అద్దెకు తీసుకునేవారి ఆర్థిక చరిత్రను పరిశీలించి బాండ్ (Rental Bond)ను జారీ చేస్తారు. యజమానికి ఇది ఒక భరోసా లాంటిది. అద్దె తీసుకోబోయేవారి ఆర్థిక స్తోమత బాగానే ఉందని.. వారికి సకాలంలో అద్దె చెల్లించే సామర్థ్యం ఉందని హామీ ఇవ్వడమే బాండ్ వెనకున్న అసలు ఉద్దేశం.
ఎలా పనిచేస్తుంది?
ఒకవేళ అద్దెకు ఇల్లు తీసుకున్నవారు మధ్యలో ఎగవేస్తే బాండ్ (Rental Bond)లో ఇచ్చిన హామీ మొత్తాన్ని యజమానికి బాండ్ జారీ చేసిన సంస్థలే చెల్లిస్తాయి. తర్వాత ఆ మొత్తాన్ని బాండ్ తీసుకున్నవారి దగ్గరి నుంచి వసూలు చేస్తాయి. బ్యాంకులు రుణాన్ని వసూలు చేసే సమయంలో అనుసరించే ప్రక్రియనే రెంటల్ బాండ్ (Rental Bond) జారీ సంస్థలు కూడా అవలంబిస్తాయి.
యజమానులకు ప్రయోజనాలు..
ఆర్థిక రక్షణ: ఒకవేళ అద్దెదారులు అద్దె సకాలంలో చెల్లించకపోతే.. బాండ్ (Rental Bond) ద్వారా దాన్ని రాబట్టుకోవచ్చు. లేదా ఇంటికి ఏదైనా డ్యామేజ్ చేసినా కూడా బాండ్లో పేర్కొన్న హామీ మొత్తం ద్వారా జరిగిన నష్టాన్ని పూడ్చుకోవచ్చు.
అద్దెదారులదే బాధ్యత: బాండ్ అంటే ఒక చట్టబద్ధమైన హామీ పత్రం. ఈ నేపథ్యంలో అద్దెదారులు ఇంటి పట్ల బాధ్యతగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. లేదంటే లీజ్ ఒప్పందంలో పేర్కొన్న నిబంధనలను ఉల్లంఘించనట్లవుతుంది. అలాంటప్పుడు చట్టపరంగా వెళ్లి జరిగిన నష్టాన్ని రికవరీ చేసుకునేందుకు యజమానికి హక్కు ఉంటుంది.
భద్రత: రెంటల్ బాండ్ (Rental Bond) యజమానులకు ఒక భద్రతను కల్పిస్తుంది. తమ ఇంటికి ఎలాంటి హాని జరగబోదనే భరోసానిస్తుంది. ఒకవేళ ఏదైనా జరిగినా.. తిరిగి వసూలు చేసుకునే అవకాశం ఉంటుందనే నమ్మకాన్ని కలిగిస్తుంది.
అద్దెదారులకు ప్రయోజనాలు..
- అద్దెకు ఇల్లు దొరికే అవకాశాలు మెరుగుపడతాయి. కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు తెలియని వారికి ఇంటిని అద్దెకు ఇవ్వాలంటే యజమానులు సాధారణంగా విముఖత వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు రెంటల్ బాండ్ అండగా ఉంటుంది.
- అద్దె తీసుకునేవారికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి. యజమాని కచ్చితంగా ఇంటికి ఎప్పటికప్పుడు కావాల్సిన మరమ్మతులు చేయించాల్సి ఉంటుంది. లేదంటే అద్దెదారులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఒక్కోసారి యజమానులు ఉన్నపళంగా ఇల్లు ఖాళీ చేయమని అంటుంటారు. ఇలాంటి సందర్భాల్లో అద్దెదారులు చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు బాండ్ (Rental Bond)ను ఉపయోగించుకోవచ్చు. ఒప్పందంలో పేర్కొన్న నిబంధనలనన్నింటిని యజమాని కూడా పాటించాల్సి ఉంటుంది.
- ఒప్పందం ముగిసిన తర్వాత రెంటల్ బాండ్ (Rental Bond)ను అద్దెదారునికి యజమాని తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. తద్వారా తమ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ జరగలేదని.. అద్దె బకాయిలు లేవని యజమాని హామీ ఇచ్చినట్లు అవుతుంది. ఫలితంగా భవిష్యత్‌లో అద్దెదారులకు ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు ఉండవు.
- రెంటల్ బాండ్ (Rental Bond) తీసుకునేటప్పుడు అందులో నియమ నిబంధనల్ని సరిగా అర్థం చేసుకోవాలి. ఎలాంటి అపార్థాలకు తావు లేకుండా చూసుకోవాలి. ఎంత మొత్తం చెల్లించాలి, ఎప్పటి వరకు అద్దెకు ఉండొచ్చు, ముందు నుంచే ఇంటికి ఏమైనా డ్యామేజ్లు ఉన్నాయా? ఉంటే వాటిని ఒప్పందంలో పేర్కొన్నారా? వంటి అంశాలను పరిశీలించుకోవాలి. ఒకవేళ ముందే డ్యామేజ్ ఉంటే అద్దెదారులపై యజమాని ఎలాంటి బాధ్యతలను ఉంచుతున్నారో చూసుకోవాలి. వీలైతే.. ఇంటి పరిస్థితిని వీడియో, ఫొటోల రూపంలో నిక్షిప్తం చేసి పెట్టుకుంటే ఇంకా మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
యజమానులు, అద్దెదారులకు మధ్య రెంటల్ బాండ్ (Rental Bond) ఒక నమ్మకాన్ని పాదుకొల్పుతుంది. ఇరు పక్షాల హక్కులను కాపాడుతుంది. ఆర్థిక భరోసాను కల్పిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమాలో నెట్వర్క్ ఆసుపత్రుల ప్రాధాన్యత ఏమిటి?
ప్రతి ఆరోగ్య బీమా సంస్థ తన పాలసీదారులకు నగదు రహిత చికిత్సనందించడానికి కొన్ని ఆసుపత్రులతో భాగస్వామ్యాన్ని (టై-అప్) కలిగి ఉంటుంది. దీని వల్ల పాలసీదారులకు ప్రయోజనమేంటో ఇక్కడ తెలుసుకుందాం.. -
తీవ్ర వ్యాధుల చికిత్సకు ఆర్థిక భరోసా
అనారోగ్యం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ఓవైపు పెరుగుతున్న వైద్య చికిత్స ఖర్చులతో కేవలం ఆరోగ్య బీమా పాలసీ ఒక్కటే ఉంటే సరిపోని రోజులివి. -
వేతనంలోఎంత పొదుపు చేయాలంటే
వచ్చిన ఆదాయాన్నంతా ఖర్చు చేస్తే.. భవిష్యత్ లక్ష్యాలను సాధించడం కష్టమవుతుంది. కాబట్టి, పొదుపు, పెట్టుబడులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. -
ఫిక్స్డ్ డిపాజిట్.. ఈ పత్రాలు ఇచ్చారా?
బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయా? వీటిపై వచ్చే వడ్డీపై మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్) విధించకుండా ఫారం 15జీ / ఫారం15హెచ్ సమర్పించేందుకు సమయం ఇదే. -
ప్రభుత్వ సంస్థల్లో
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఒక ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్) పథకాన్ని తీసుకొచ్చింది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ నిఫ్టీ పీఎస్ఈ ఈటీఎఫ్ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ ముగింపు తేదీ ఈ నెల 16. కనీస పెట్టుబడి రూ.500. నిఫ్టీ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (పీఎస్) ఇండెక్స్ ఆధారంగా రూపొందించిన ఓపెన్ ఎండెడ్ పథకం ఇది. -
క్రెడిట్ కార్డుల ద్వారా క్యాష్‌బ్యాక్ ఎలా సంపాదించాలి?
క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డులు మీరు వస్తువులను కొనుగోలు చేయడానికి మీ కార్డు స్వైప్ చేసినప్పుడు కొంత డబ్బును తిరిగి పొందేందుకు ఉపయోగపడతాయి. -
ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా? ఈ ప్రయోజనాలు తెలుసా?
Credit cards: సులభంగా క్రెడిట్ కార్డులు జారీ చేస్తుండటంతో చాలా మంది ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డుల్ని ఉపయోగిస్తున్నారు. వాటిని ఎలా సమర్థంగా వినియోగించాలో తెలుసుకోండిలా.. -
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
Section 54F: వారసత్వంగా వచ్చిన ఆభరణాలను విక్రయించగా వచ్చిన మొత్తాన్ని ఇల్లు కొనుగోలుకు వినియోగిస్తే.. మూలధన లాభాల పన్ను వర్తించదని ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 54ఎఫ్ చెబుతోంది. -
ఆరోగ్య బీమా.. ఏ వయసులోనైతే మేలు..?
ఒక వ్యక్తి యుక్త వయసులోనే ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం వల్ల ప్రీమియం తగ్గింపు సహా అనేక ప్రయోజనాలుంటాయి. అవేంటో తెలుసుకోండి.. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
Mutual Funds: స్మాల్ క్యాప్ ఫండ్లపై రాబడులివే
స్మాల్ క్యాప్ ఫండ్లలో రిస్క్ ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో గణనీయమైన రాబడిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్నింటిని ఇక్కడ చూడొచ్చు. -
సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు ప్రయోజనమేనా?
నాన్ లగ్జరీ కారు కొనుగోలు కంటే కొద్దిగా ఎక్కువ ఖర్చు చేస్తే అధునాతన ఫీచర్లు గల సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు చేయొచ్చు. ఇలాంటి కార్ల కొనుగోలుతో ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం. -
జీవిత బీమాలో క్లెయిం సెటిల్మెంట్ ఎలా?
జీవిత బీమా క్లెయిమ్స్ సెటిల్మెంట్ అనేది బీమా సంస్థకు సంబంధించిన ముఖ్యమైన సేవల్లో కీలకమైనది. క్లెయిం సెటిల్మెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. -
ఆరోగ్య బీమా కొనుగోలుకు వయో పరిమితి తొలగింపు
ఆరోగ్య బీమా కొనుగోలుకు ఉన్న వయో పరిమితిని ఐఆర్డీఏ తొలగించింది. దీంతో అన్ని వయసుల వారూ బీమా పాలసీని తీసుకునే అవకాశం లభించనుంది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్‌లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు
తాజా వార్తలు (Latest News)
-
మా ఇంట్లో ఓట్లు.. అమ్మకానికి లేవు
-
8 ఏళ్ల ప్రేమ.. వివాహమైన వెంటనే పారిపోయిన భర్త
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)