Mutual Funds: Mutual Funds: స్మాల్‌ క్యాప్‌ ఫండ్లపై రాబడులివే

స్మాల్‌ క్యాప్‌ ఫండ్లలో రిస్క్‌ ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో గణనీయమైన రాబడిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్నింటిని ఇక్కడ చూడొచ్చు.

Published : 23 Apr 2024 14:06 IST

మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు ఈ మధ్య కాలంలో బాగా పెరిగాయి. స్మాల్‌ క్యాప్‌ ఫండ్లు తమ కార్పస్‌లో ఎక్కువ భాగాన్ని స్మాల్‌ క్యాప్‌ కంపెనీల ఈక్విటీ సంబంధిత సాధనాల్లో పెట్టుబడి పెడతాయి. సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా(సెబీ) ప్రకారం స్మాల్‌ క్యాప్‌ ఫథకాలు తమ నిధులలో 80% స్మాల్‌ క్యాప్‌ కంపెనీలలో పెట్టుబడి పెట్టాలి. ఇవి ప్రధానంగా రూ.5,000 కోట్ల కంటే తక్కువ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఉన్న కంపెనీల షేర్లలో పెట్టుబడి పెడతాయి. ఇతర రకాల ఈక్విటీ ఫండ్లతో పోలిస్తే స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌లు అధిక రిస్క్‌తో ముడిపడి ఉంటాయి. మార్కెట్‌లో స్వల్ప ఒడిదుడుకులు కూడా స్మాల్‌ క్యాప్‌ కంపెనీల షేర్ల ధరలపై భారీ ప్రభావం చూపుతాయి. అయినప్పటికీ, ఈ ఫండ్లు 8-10 ఏళ్ల దీర్ఘకాలంలో గణనీయమైన రాబడిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అయితే, ఇందులో స్వల్పకాలానికి నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువ.

మ్యూచువల్‌ ఫండ్లను ఎంచుకునేటప్పుడు ఆయా కంపెనీల వెబ్‌సైట్లలోకి లాగిన్‌ అయ్యి డైరెక్ట్ ప్లాన్‌లో మదుపు చేయొచ్చు. ఇందులో మీరు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి, వీటిలో రెగ్యులర్ ప్లాన్ల కంటే 1-2 శాతం వరకు రాబడి ఎక్కువ ఉంటుంది. 

2024, ఏప్రిల్‌ 22 వరకు అత్యుత్తమ పనితీరు కనబరిచిన స్మాల్‌ క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్లను ఇక్కడ చూడండి..

గమనిక: మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు మార్కెట్‌ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. ఇవే ఫలితాలు భవిష్యత్‌లోనూ వస్తాయన్న హామీ లేదు. ఇందులో పెట్టుబడులు పెట్టేముందు SEBI రిజిష్టర్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ను సంప్రదించడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని