Samsung Galaxy: శాంసంగ్‌ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌ డేట్‌ ఫిక్స్‌.. రానున్న ఉత్పత్తులివే!

Samsung Galaxy: ఏటా నిర్వహించే అన్‌ప్యాక్ట్‌ ఈవెంట్‌ను ఈ ఏడాది కూడా నిర్వహించేందుకు శాంసంగ్‌ సిద్ధమైంది. జనవరి 17న ఈ కార్యక్రమం నిర్వహించనుంది.

Updated : 03 Jan 2024 17:36 IST

Samsung Galaxy Unpacked 2024 | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్‌ (Samsung) అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌ను నిర్వహించడానికి సిద్ధమైంది. ఏటా శాంసంగ్ కంపెనీ తయారు చేసిన కొత్త మోడళ్లను ఈ ఈవెంట్‌లో విడుదల చేస్తుంది. ఈ ఏడాది జనవరి 17న అమెరికాలోని కాలిఫోర్నియా, శాన్‌ జోస్‌ ఎస్‌ఏపీ సెంటర్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సంస్థ ప్రకటించింది.  శాంసంగ్‌ అధికారిక ఛానెల్స్‌ ద్వారా లైవ్‌ స్ట్రీమింగ్‌లో వీక్షించవచ్చు.

శాంసంగ్‌ తన ఎస్‌ సిరీస్‌లో ఎస్‌24 ఫోన్లను విడుదల చేయనున్నట్లు టెక్‌ వర్గాలు చెబుతున్నాయి. గెలాక్సీ ఎస్‌ 24 (Samsung Galaxy S24), గెలాక్సీ ఎస్‌ 24+ (Galaxy S24+), గెలాక్సీ ఎస్‌24 అల్ట్రా (Galaxy S24 Ultra) పేరిట మూడు మోడళ్లను తీసుకురానున్నట్లు సమాచారం. వీటిలో ఇన్‌బిల్ట్‌గా AI ఫీచర్లను తీసుకొస్తున్నారు. కొత్త హ్యాండ్‌సెట్‌ల కోసం ప్రీ- రిజర్వేషన్‌లు అప్పుడే ప్రారంభమయ్యాయని శాంసంగ్‌ వెల్లడించింది. ఆసక్తి ఉన్నవారు రూ.1,999తో వీఐపీ పాస్‌ ద్వారా సైన్‌ అప్‌ అయ్యి హ్యాండ్‌సెట్‌లను బుక్‌ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది.

రైల్వే నుంచి సూపర్‌ యాప్‌.. ఏమేం ఉండబోతున్నాయ్‌?

200MP కెమెరా..

ఎస్‌ 24 సిరీస్‌లోని ఫోన్లు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత వన్‌యూఐ 6.1తో రానున్నాయి. ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8జెన్‌ 3 ప్రాసెసర్‌తో ఈ ఫోన్లను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్లకు అమోలెడ్‌ ఎల్‌టీపీఓ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్‌ రేట్‌ ఇస్తున్నారు.  మూడు మోడల్స్‌లో అల్ట్రా వేరియంట్ మొబైల్‌కు 200Mp క్వాడ్ కెమెరా, మిగిలిన రెండు మోడల్స్‌ 50Mp ట్రిపుల్ కెమెరా అమర్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు