Tata Tech IPO: ఎల్‌ఐసీ రికార్డ్‌ని బ్రేక్‌ చేసిన టాటా టెక్‌

Tata Tech IPO: ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌లో ఎల్‌ఐసీ రికార్డ్‌ని టాటా టెక్నాలజీస్ అధిగమించింది.

Published : 25 Nov 2023 17:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టాటా గ్రూప్‌ నుంచి వచ్చిన టాటా టెక్నాలజీస్ ఐపీఓ సరికొత్త రికార్డును నమోదు చేసింది. సబ్‌స్క్రిప్షన్‌లో భాగంగా మూడు రోజుల పాటు భారీ సంఖ్యలో స్పందన అందుకున్న ఈ ఐపీఓ.. తాజాగా ఎల్‌ఐసీ పేరిట ఉన్న రికార్డును చెరిపేసింది. స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో అతిపెద్ద ఐపీఓగా వచ్చిన ఎల్ఐసీ (LIC)..  రూ.20,557 కోట్లు సమీకరించడంలో భాగంగా అత్యధికంగా 73.4 లక్షల దరఖాస్తుల్ని అందుకుంది. తాజాగా టాటా టెక్నాలజీస్‌ ఐపీఓ (Tata Tech IPO) ఆ రికార్డును అధిగమించింది. రూ.3,043 కోట్ల సమీకరించేందుకు వచ్చిన ఈ ఐపీఓకు భారీ స్థాయిలో సబ్‌స్క్రిప్షన్‌ నమోదైంది. 73.60 లక్షల దరఖాస్తులతో ఎల్‌ఐసీ రికార్డును బ్రేక్‌ చేసింది. టాటా గ్రూప్‌ నుంచి రెండు దశాబ్దాల తర్వాత వచ్చిన ఐపీఓ కావడంతో భారీ స్థాయిలో స్పందన లభించింది.

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కొత్త హిమాలయన్‌.. ధర, ఫీచర్లు ఇవిగో!

టాటా టెక్‌ సహా ఫ్లెయిర్‌ రైటింగ్‌, ఫెడ్‌బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, గాంధార్‌ ఆయిల్‌ రిఫైనరీ, ఐఆర్‌ఈడీఏ ఐపీఓల పబ్లిక్‌ ఇష్యూలు ముగిశాయి.రూ.7,380 కోట్లను సమీకరించేందుకు వచ్చిన ఈ మొత్తం ఐపీఓలకు రూ.2.6 లక్షల కోట్ల విలువకు దరఖాస్తులు వచ్చాయి. అయితే వీటన్నింటిల్లోనూ టాటా టెక్‌ ఐపీఓకు 69.4 రెట్లతో అధిక స్పందన వచ్చింది. పెన్నుల తయారీ కంపెనీ ఫ్లెయిర్‌ రైటింగ్ ఇండస్ట్రీస్‌ రూ.593 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఐపీఓకు రాగా 17 లక్షల దరఖాస్తులతో 46.7 రెట్లు చొప్పున సబ్‌స్క్రిప్షన్‌ లభించింది. రూ.500.69 కోట్ల గాంధార్‌ ఆయిల్‌ రిఫైనరీ ఐపీఓకు సైతం 28.5 లక్షల అప్లికేషన్లతో 64.2 రెట్లు చొప్పున స్పందన లభించింది. రూ.2,150 కోట్లు సమీకరించాలనే లక్ష్యంతో వచ్చిన ఐఆర్‌ఈడీఏకు 38.8 రెట్ల స్పందన అందుకుంది. రూ.1,092 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఫెడరల్‌ బ్యాంక్‌ అనుబంధ సంస్థ ఫెడ్‌బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 2.2 రెట్ల స్పందన మాత్రమే వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు