TomTom: ప్రపంచంలో అత్యంత ట్రాఫిక్‌ రద్దీ నగరం ఇదే..!

ప్రపంచంలోనే అత్యంత ట్రాఫిక్‌ రద్దీ గల నగరాల్లో భారత్‌లోని బెంగళూరు 6వ స్థానంలో నిలిచింది. ‘టామ్‌ టామ్‌ ట్రాఫిక్‌ సూచీ-2023’లో ఇది వెల్లడైంది.

Updated : 04 Feb 2024 21:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గతేడాదికి సంబంధించి ప్రపంచంలోనే అత్యంత ట్రాఫిక్‌ రద్దీ గల నగరంగా బ్రిటన్‌ రాజధాని లండన్ (London) నిలిచింది. ఇక్కడ 10 కిలోమీటర్ల ప్రయాణానికి సగటున 37 నిమిషాలకుపైగా పడుతున్నట్లు ‘టామ్‌టామ్‌ ట్రాఫిక్‌ సూచీ-2023 (TomTom Traffic Index)’లో వెల్లడైంది. డబ్లిన్‌ (ఐర్లాండ్‌), టొరంటో (కెనడా)లు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. టాప్‌-10 జాబితాలో భారత్‌లోని బెంగళూరు (6), పుణె (7)లు ఉన్నాయి.

వాహన బీమా.. అనుబంధాలతో అదనపు రక్ష

  • 55 దేశాల్లోని 387 నగరాల్లో 60 కోట్లకుపైగా ఇన్-కార్ నావిగేషన్ సిస్టమ్‌లు, స్మార్ట్‌ఫోన్‌ల సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు సంస్థ తెలిపింది.
  • గతేడాది బెంగళూరులో 10 కి.మీల ప్రయాణానికి సగటున 28.10 నిమిషాలు పట్టినట్లు నివేదికలో తేలింది. రద్దీ కారణంగా ఇక్కడి వాహనదారులు ఏడాదిలో 132 గంటలు కోల్పోయారు. సగటు వేగం గంటకు 18 కి.మీలు మాత్రమే.
  • పుణెలో 10 కిలోమీటర్లకు 27.50 నిమిషాల సమయం పట్టింది. స్థానికంగా వాహనాల సగటు వేగం గంటకు 19 కి.మీలుగా ఉంది. మొత్తం జాబితాలో దిల్లీ, ముంబయిలు 44, 54వ స్థానాల్లో నిలిచాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని