logo

రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ తగ్గించాలి

పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ తగ్గిస్తే ధరలు మరింత దిగివచ్చే అవకాశం ఉంటుందని భాజపా జిల్లా అధ్యక్షుడు డా.కొత్తపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలపై సుంకాన్ని

Published : 23 May 2022 03:35 IST

ఆసిఫాబాద్, న్యూస్‌టుడే: పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ తగ్గిస్తే ధరలు మరింత దిగివచ్చే అవకాశం ఉంటుందని భాజపా జిల్లా అధ్యక్షుడు డా.కొత్తపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలపై సుంకాన్ని తగ్గించడంతో ఆదివారం జిల్లా కేంద్రంలో భాజపా ఆధ్వర్యంలో ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి సంబరాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ఇంధన ధరలు రెండుసార్లు తగ్గించిందని.. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ తగ్గించి పేదలకు మరింత మేలు జరిగేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్, నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆత్మారాం నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు విశాల్, పార్టీ శ్రేణులు బోనగిరి సతీష్‌బాబు, మురళీధర్, నవీన్‌గౌడ్, ఓదెలు, శ్రీనివాస్, సుధాకర్, కార్తీక్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని