logo

కాడెడ్ల నుంచి.. హస్తానికి..

దేశంలో తొలిసారి జరిగిన ఎన్నికల నుంచి పరిశీలిస్తే రాజకీయ పార్టీల గుర్తుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. 1952లో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎన్నికల గుర్తు కాడెడ్లు..

Updated : 15 Nov 2023 12:35 IST

కాంగ్రెస్‌కు మొదట్లో కాడెడ్లు.. పీడీఎఫ్‌కు హస్తం

దేశంలో తొలిసారి జరిగిన ఎన్నికల నుంచి పరిశీలిస్తే రాజకీయ పార్టీల గుర్తుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. 1952లో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎన్నికల గుర్తు కాడెడ్లు.. ఈ గుర్తుతోనే దేశమంతా జరిగిన ఎన్నికల బరిలో నిలిచారు. ఆ తర్వాత పార్టీ చీలి కాంగ్రెస్‌ (ఇందిర) ఏర్పాటు కావడంతో దీనికి ‘ఆవుదూడ’ గుర్తు కేటాయించారు. ఇదే గుర్తుతో 1971 ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత చీలిపోయిన కాంగ్రెస్‌ తిరిగి విలీనమై భారత జాతీయ కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ) పేరుతో ఏర్పడటంతో దీనికి హస్తం’ గుర్తును కేటాయించడంతో 1977 నుంచి హస్తం గుర్తుతో  ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు..

పీడీఎఫ్‌కు మొదట్లో హస్తం

1952 సార్వత్రిక ఎన్నికల సమయంలో కమ్యూనిస్టు పార్టీపై నిర్బంధం ఉండటంతో పీడీఎఫ్‌ పేరుతో బరిలో నిలవగా వీరికి స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే ‘హస్తం’ గుర్తును కేటాయించారు. ఆ తర్వాత సీపీఐకి కంకి కొడవలి సీపీఎంకు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తులను కేటాయించడంతో ఇవే గుర్తులతో ప్రస్తుతం బరిలో నిలుస్తున్నాయి.

- న్యూస్‌టుడే, దండేపల్లి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని