logo

మంచి నీళ్లు మహాప్రభో..

మండలంలోని దోందారి పంచాయతీ పరిధిలోని చాకిరేవు గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని టీఏజీఎస్‌ ఆధ్వర్యంలో సోమవారం నిరసన వ్యక్తం చేశారు.

Published : 16 Apr 2024 02:38 IST

తాగునీటి కోసం చేతిపంపు వద్ద నిరసన తెలుపుతున్న గ్రామస్థులు

పెంబి, న్యూస్‌టుడే: మండలంలోని దోందారి పంచాయతీ పరిధిలోని చాకిరేవు గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని టీఏజీఎస్‌ ఆధ్వర్యంలో సోమవారం నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో 18 కుటుంబాలు ఉండగా ఒక్కటే చేతిపంపు ఉందని, వేసవి కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ఆ చేతిపంపులో సైతం నీరు లేక వాగు, చెలిమెల నీరే తాగుతున్నామని అన్నారు. వేసవి దృష్ట్యా అధికారులు, పాలకులు స్పందించి మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. టీఏజీఎస్‌ మండలాధ్యక్షుడు తురం దుత్తు, లింబారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని