logo

ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం, సలహాలు

అండర్‌ ట్రయల్‌, కన్విక్ట్‌ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం, న్యాయ సలహాలను అందించే పథకాన్ని జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వారు ప్రవేశ పెట్టినట్టు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డాక్టర్‌ వి.ఆర్‌.కె.కృపాసాగర్‌ తెలిపారు.

Published : 29 Jan 2023 05:27 IST

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డాక్టర్‌ కృపాసాగర్‌

శిక్షణ తరగతులకు హాజరైన కౌన్సిల్‌ సభ్యులతో హైకోర్టు న్యాయమూర్తి

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : అండర్‌ ట్రయల్‌, కన్విక్ట్‌ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం, న్యాయ సలహాలను అందించే పథకాన్ని జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వారు ప్రవేశ పెట్టినట్టు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డాక్టర్‌ వి.ఆర్‌.కె.కృపాసాగర్‌ తెలిపారు. సదరు ఖైదీలకు అన్ని జిల్లాల్లో ఉచితంగా న్యాయ సహాయం లభిస్తుందని పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ ఆదేశాలతో.. రాష్ట్రంలో న్యాయసేవాధికార సంస్థ వారు నూతనంగా నియమించిన ‘లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్స్‌’లకు రెండు రోజుల పాటు నిర్వహించనున్న శిక్షణ తరగతులను, విజయవాడ ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో శనివారం ప్రారంభించారు.  కేసుల ట్రయిల్‌కు, అప్పీలుకు, బెయిల్‌ దరఖాస్తులకు అవసరమైన ఉచిత న్యాయ సహాయాన్ని అన్ని క్రిమినల్‌ కేసుల్లో పొందవచ్చని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు