logo

స్లాస్‌ పరీక్షకు 142 పాఠశాలల ఎంపిక

స్టేట్‌ లెర్నింగ్‌ అచీవ్‌మెంట్‌ సర్వే(2024)పరీక్షల నిర్వహణపై సోమవారం నగరంలోని కృష్ణవేణి ఐటీఐలో అవగాహన సదస్సు నిర్వహించారు.

Published : 16 Apr 2024 05:23 IST

మచిలీపట్నం(గొడుగుపేట),న్యూస్‌టుడే: స్టేట్‌ లెర్నింగ్‌ అచీవ్‌మెంట్‌ సర్వే(2024)పరీక్షల నిర్వహణపై సోమవారం నగరంలోని కృష్ణవేణి ఐటీఐలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న డీఈవో తాహెరా సుల్తానా మాట్లాడుతూ ఈనెల 16న నిర్వహించనున్న స్లాస్‌ పరీక్షలకు జిల్లాలోని 142 పాఠశాలలను ఎంపిక చేశామన్నారు. ఆ పాఠశాలల్లోని నాల్గవ తరగతి విద్యార్థులు 3,229మంది పరీక్షలకు హాజరవుతారని , తెలుగు, ఇంగ్లీషు, గణితం ఏదైనా రెండు సబ్జెక్టులలో  నిర్వహిస్తారని తెలిపారు. ఒక్కో సబ్జెక్టుకు 90నిమిషాల పాటు పరీక్ష ఉంటుందని తెలిపారు. విద్యార్థుల అభ్యసనా నైపుణ్యాలు, వెనుకబడిన అంశాలను తెలుసుకునేందుకే ఇవి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇన్విజిలేటర్లు, ఎంఈవోలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు., డీసీఈబీ సెక్రటరీ షేక్‌జాన్‌సాహెబ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని