logo

నగల దుకాణంలో చోరీ

కంచికచర్లలోని ఓ నగల దుకాణంలో రూ.14 లక్షల విలువైన ఆభరణాలు చోరీ అయ్యాయి. పక్కా ప్రణాళికతోనే దొంగలు చోరీకి తెగబడినట్లు తెలుస్తోంది.

Published : 16 Apr 2024 05:27 IST

ఠాణాకు అతి దగ్గర్లోనే ఘటన

ఆధారాలు సేకరిస్తున్న క్లూస్‌టీం, పోలీసులు

కంచికచర్ల, న్యూస్‌టుడే: కంచికచర్లలోని ఓ నగల దుకాణంలో రూ.14 లక్షల విలువైన ఆభరణాలు చోరీ అయ్యాయి. పక్కా ప్రణాళికతోనే దొంగలు చోరీకి తెగబడినట్లు తెలుస్తోంది. స్థానిక పోలీసుస్టేషన్‌, నందిగామ గ్రామీణ సీఐ కార్యాలయానికి చేరువలోనే ఈ ఘటన జరగడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక ఠాణా సమీపంలో రహదారి పక్కన వాసవీ జ్యూయలరీ దుకాణం ఉంది. ఎప్పటివలెనే ఆదివారం సాయంత్రం యజమాని దుకాణానికి తాళాలు వేసి వెళ్లారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో దొంగలు దుకాణం షట్టర్‌ తాళాలు పగలగొట్టి 350 గ్రాముల బంగారం, 8 కిలోల వెండి ఆభరణాలను అపహరించారు. సీసీటీపీ ఫుటేజీ నిక్షిప్తమైన బాక్స్‌ను కూడా పగలగొట్టి తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్‌టీం ఆధారాలు సేకరించారు. పోలీసు జాగిలాలను రప్పించారు. చోరీ దృశ్యాలు సమీపంలోని మరో జ్యూయలరీ షాపు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఇద్దరు ఆగంతకులు బైక్‌ వచ్చి గునపంతో తాళాలు పగలగొట్టి తీరిగ్గా పని ముగించుకుని వెళ్లినట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించింది. పోలీసులు వాటి ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని క్రైమ్‌ ఏసీపీ స్రవంతిరాయ్‌, ఏసీపీ రవికిరణ్‌, గ్రామీణ సీఐ పి.చంద్రశేఖర్‌, ఎస్సైలు సుబ్రహ్మణ్యం, హైమావతి పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని