logo

ముగింపులో ముంచే వానలు

వానాకాలం ముగింపులోనూ గ్రేటర్‌లో అధిక వర్షాలు కురుస్తున్నాయి. దట్టమైన మేఘాలు కమ్ముకుని.. ఒక్కసారిగా కుంభవృష్టి కురుస్తోంది. సెప్టెంబరు మాసంలో గత మూడేళ్లుగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఫలితంగా సీజన్‌

Published : 28 Sep 2022 02:39 IST

వరుసగా మూడో ఏటా అధిక వర్షపాతం

ఈనాడు, హైదరాబాద్‌: వానాకాలం ముగింపులోనూ గ్రేటర్‌లో అధిక వర్షాలు కురుస్తున్నాయి. దట్టమైన మేఘాలు కమ్ముకుని.. ఒక్కసారిగా కుంభవృష్టి కురుస్తోంది. సెప్టెంబరు మాసంలో గత మూడేళ్లుగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఫలితంగా సీజన్‌ ముగిసే నాటికి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతోంది. వరుసగా మూడేళ్ల పాటు ఇదే పరిస్థితి నెలకొనడం కొన్నేళ్లలో ఇదే మొదటిసారి. ఇప్పటివరకు హైదరాబాద్‌లో 31 శాతం అధిక వర్షపాతం నమోదైతే.. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 52 శాతం వానలు పడ్డాయి. గత రెండేళ్లుగా చూస్తే అక్టోబరులోనూ వానలు దంచి కొడుతున్నాయి.

అత్యధికం ఎక్కడంటే...
హైదరాబాద్‌ జిల్లా పరిధిలో ఆసిఫ్‌నగర్‌, నాంపల్లి,హిమాయత్‌నగర్‌, అమీర్‌పేట ప్రాంతాల్లో 6 నుంచి 10 సెం.మీ. వరకు వర్షపాతం పడింది.

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో మేడిపల్లి, ఘట్‌కేసర్‌, ఉప్పల్‌, కుత్బుల్లాపూర్‌, మల్కాజిగిరి పరిధిలో 3.5 నుంచి 10 సెం.మీ.దాకా వర్షాలు పడ్డాయి.

రంగారెడ్డిలో గండిపేట, అబ్దుల్లాపూర్‌మెట్‌, రాజేంద్రనగర్‌ పరిధిలో భారీవానలు కురిశాయి.

సెప్టెంబరులో జోరుగా..

2019 సెప్టెంబరు 25న తిరుమలగిరిలో 13.2 సెం.మీ.

ఈ ఏడాది సెప్టెంబరు 26న షేక్‌పేటలో 11.4 మి.మీ. ః 2021 సెప్టెంబరు 26న మణికొండలో 10.8 సెం.మీ. వర్షం కురిసింది.

24 గంటల వ్యవధిలో ..
1908లో నిజాం అబ్జర్వేటరీ రికార్డుల ప్రకారం హైదరాబాద్‌లో 24 గంటల వ్యవధిలో 43.1 సెం.మీ. వర్షపాతం కురిసింది. 

2000 ఆగస్టు 24న 24.1సెం.మీ.

జులై 21, 2012లో సరూర్‌నగర్‌లో రికార్డు స్థాయిలో 22.6 సెం.మీ.

రెండేళ్ల క్రితం 2020 అక్టోబరు 14న హయత్‌నగర్‌లో 30 సెం.మీ.వర్షం పడింది.

ఎందుకిలా.. గ్రేటర్‌లో  నైరుతి రుతుపవనాలకు తోడు ఆవర్తనాలు, అల్ప పీడనాల ప్రభావంతో మూడేళ్లుగా అధిక వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబరు 1న తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని