logo

క్షౌరశాల సక్రమంగా నడవక.. నిర్వాహకుడి ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో క్షౌరశాల నిర్వాహకుడు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట ఠాణా పరిధిలో మంగళవారం జరిగింది. ఎస్సై

Published : 28 Sep 2022 02:38 IST

శామీర్‌పేట, న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందులతో క్షౌరశాల నిర్వాహకుడు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట ఠాణా పరిధిలో మంగళవారం జరిగింది. ఎస్సై రవికుమార్‌, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా వేములగట్టుకు చెందిన మాచూరి కృష్ణ(50) 30ఏళ్ల క్రితం హైదరాబాద్‌ వచ్చారు. ఉప్పుగూడ డీఆర్‌డీఎల్‌ రామకృష్ణాపురం కాలనీలో సొంత ఇల్లు నిర్మించుకున్నారు. అక్కడే క్షౌరశాల ఏర్పాటుచేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇటీవల దుకాణం సక్రమంగా నడవడం లేదని కుటుంబ సభ్యులతో తరచూ బాధపడే వారు. ఈ నెల 25 ఇంట్లో పండగ చేసుకున్నారు. మరుసటి రోజు ఉదయం ఆయన చిన్నాన్న గోపాల్‌ దగ్గరికి గజ్వేల్‌ వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయలుదేరారు. చీకటి పడినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్‌ చేస్తే స్విచ్ఛాప్‌ వచ్చింది. శామీర్‌పేట పెద్ద చెరువులో మత్స్యకారులకు మంగళవారం శవం కనిపించింది. అక్కడలభించిన ఆధార్‌ కార్డు, ఫోన్‌ నంబరుతో పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని