logo

అనుమతుల్లేకుండా.. విద్యుత్తు ఆటోల అమ్మకాలు!

విద్యుత్తు వాహనాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న ప్రత్యేక సౌకర్యాలు, అనుమతులను నగరంలో కొందరు వాహనాల డీలర్లు సొంత లాభాలకు వినియోగించుకుంటున్నారు. ఈ-ఆటోలు విక్రయించేందుకు రవాణాశాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంది.

Updated : 03 Oct 2022 06:31 IST

గూడ్స్‌ బండ్ల పేరుతో విక్రయం

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్తు వాహనాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న ప్రత్యేక సౌకర్యాలు, అనుమతులను నగరంలో కొందరు వాహనాల డీలర్లు సొంత లాభాలకు వినియోగించుకుంటున్నారు. ఈ-ఆటోలు విక్రయించేందుకు రవాణాశాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంది. గూడ్స్‌ ఆటోలు విక్రయించేందుకు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్న నిబంధనల సాకుతో గూడ్సు వాహనాల తరహలోనే ప్యాసింజర్‌ ఆటోలను విక్రయిస్తున్నారు. కొద్దినెలల నుంచి   మహీంద్ర, పియా జియో, ఈ-రిషాలతోపాటు మరికొన్ని కంపెనీలు విద్యుత్తు ఆటోలను విక్రయిస్తున్నాయి. కాలుష్య రహితం, శబ్దం లేకుండా రహదారులపై వెళ్తుండడం, ఎల్‌పీజీ ధర పెరుగుతుండడం వంటి కారణాలతో ఆటోడ్రైవర్లు ఈ-ఆటోలను కొనేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. కొద్దిరోజుల నుంచి ఈ-ప్యాసింజర్‌ ఆటోలు రిజిస్ట్రేషన్‌కు వస్తుండంతో రవాణాశాఖ అధికారులు వీటిపై దృష్టి కేంద్రీకరించారు. అనుమతులు లేకుండా ఈ-ఆటోలు విక్రయిస్తే కఠిన చర్యలు చేపడతామంటూ హెచ్చరించారు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు అవసరం
నగరంలో గూడ్స్‌ ఆటోలు వందల్లోనే ఉన్నాయి. రవాణాశాఖ నుంచి అనుమతి(లైసెన్స్‌) లేకుండా నగరంలో కొందరు డీలర్లు ప్యాసింజర్‌ ఆటోలను విక్రయిస్తున్నారు. ఈ-ప్యాసింజర్‌ ఆటోను కొనాలంటే ముందుగా రవాణాశాఖ అనుమతి పొందాలి. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకుంటే రవాణాశాఖ అధికారులు దరఖాస్తుదారుడి వివరాలు, లైసెన్సును పరిశీలించి ఆటోను కొనేందుకు అనుమతులిస్తారు. ఆటోను కొన్నాక అనుమతి పత్రంతో రవాణాశాఖ అధికారులను సంప్రదిస్తే ఈ-ఆటోకు రిజిస్ట్రేషన్‌ చేయడంతోపాటు ప్రత్యేక నంబర్‌ ప్లేట్‌ను కేటాయిస్తారు.

నిషేధం ఉన్నందుకే..  హైదరాబాద్‌లో డీజిల్‌, పెట్రోల్‌, ఎల్‌పీజీ కొత్త ఆటోలపై ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం నిషేధం విధించింది. ఆటోల ద్వారా కాలుష్యం పెరిగిపోతోందన్న కారణంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే కొందరు డీలర్లు రవాణా శాఖ దృష్టి పడకుండా ఈ-గూడ్స్‌ ఆటోల పేరుతో అమ్మేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని