logo

ఆటోలు చోరీ చేసి.. పాత పత్రాలతో జతచేసి..

ఆటోలను చోరీచేసి..విక్రయిస్తున్న  ముఠాలోని 8 మందిని ఎల్బీనగర్‌ పోలీసులు రిమాండుకు తరలించారు. వారి వద్ద 9 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.

Published : 30 Nov 2022 01:58 IST

అమ్మి సొమ్ము చేసుకుంటున్న ముఠాలో 8 మంది అరెస్టు

ఆటోల ముందు కూర్చున్న నిందితులను చూపుతున్న పోలీసులు

నాగోలు: ఆటోలను చోరీచేసి..విక్రయిస్తున్న  ముఠాలోని 8 మందిని ఎల్బీనగర్‌ పోలీసులు రిమాండుకు తరలించారు. వారి వద్ద 9 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఠాణాలో ఏసీపీ శ్రీధర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు.  మైలార్‌దేవులపల్లి వట్టెపల్లికి చెందిన మహ్మద్‌ వాజిద్‌ అహ్మద్‌ ఆలియాస్‌ షా(51) ఆటోడ్రైవర్‌. చోరీచేసిన ఆటోలను అమ్ముతుంటాడు. వాటిని నగర రోడ్లపై నడిపేందుకు ఓ ముఠాను సృష్టించాడు.ఆస్మాన్‌ఘడ్‌ వాసి మహ్మద్‌రిజ్వాన్‌ ఆలియాస్‌ అజ్జూ(36), మహ్మద్‌ షకీల్‌(36)లు ఆటోలను చోరీచేస్తారు. వాటిని మహ్మద్‌వాజిద్‌ కొనుగోలు చేస్తాడు. ఛాసిస్‌, ఇంజిన్‌ నంబర్లను  మహ్మద్‌ సలీమ్‌ అలీ(40) సాయంతో తొలగింపజేసి మరో నంబర్లను చెక్కిస్తాడు. అందుకోసం గాజులరామారం లెనిన్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ రషీద్‌(38) వద్ద పాత ఆటోల  దస్తావేజులు సేకరిస్తాడు. ఆర్టీవో కార్యాలయ అధికారులు, సిబ్బంది వద్ద దస్తావేజులు అక్రమంగా రషీద్‌ కొనుగోలు చేయగా.. వాటిని వాజిద్‌ షా కొంటుంటాడు. వికారాబాద్‌ ఆర్టీవో కార్యాలయంలో ఏజెంట్‌ అమ్జాద్‌ఖాన్‌(38) వాటిని రెన్యూవల్‌ చేయిస్తాడు. ఆపై ఆటోలను అమ్మి సొమ్ముచేసుకుంటున్నాడు. హైదర్‌ హుస్సేన్‌(45), సయ్యద్‌ మునీర్‌ అలీలు సైతం చోరీ ఆటోల రూపుమార్చి అమ్మేస్తున్నారు. ఇటీవల ఎల్బీనగర్‌, జవహర్‌నగర్‌, సైదాబాద్‌, అంబర్‌పేట ఠాణాల పరిధిలో ఆటోలు చోరీ కావడంతో బాధితుల ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్‌ పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించి.. ముఠాలోని 8 మందిని అరెస్టుచేశారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు