logo

మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాలకు కొత్త కలెక్టర్లు

మేడ్చల్‌ - మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలకు కొత్త కలెక్టర్లుగా డి.అమోయ్‌ కుమార్‌, ఎస్‌.హరీశ్‌ నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం చేసిన ఐఏఎస్‌ అధికారుల బదిలీల్లో భాగంగా ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 01 Feb 2023 03:04 IST

హరీశ్‌,    అమోయ్‌ కుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, మేడ్చల్‌ కలెక్టరేట్‌, ఆదిభట్ల : మేడ్చల్‌ - మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలకు కొత్త కలెక్టర్లుగా డి.అమోయ్‌ కుమార్‌, ఎస్‌.హరీశ్‌ నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం చేసిన ఐఏఎస్‌ అధికారుల బదిలీల్లో భాగంగా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రంగారెడ్డి కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న అమోయ్‌ కుమార్‌ మేడ్చల్‌ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. మేడ్చల్‌ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూనే హైదరాబాద్‌ జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌గా వ్యవహరించనున్నారు. మెదక్‌ కలెక్టర్‌గా ఉన్న ఎస్‌.హరీశ్‌ రంగారెడ్డి కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆయన మెదక్‌ జిల్లా కలెక్టర్‌ బాధ్యతలతో పాటు మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టర్‌గా సుమారు ఏడాదిన్నర నుంచి వ్యవహరిస్తున్నారు. ఆయన గతంలో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. మేడ్చల్‌ కలెక్టర్‌గా నియమితులైన అమోయ్‌ కుమార్‌ గతంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని