logo

కొత్త సచివాలయం ఏప్రిల్‌ 14నే ప్రారంభించాలి

కొత్త సచివాలయాన్ని ఏప్రిల్‌ 14నే ప్రారంభించాలని, ఫిబ్రవరి 17 దేవుడికి ఇష్టం లేదు కాబట్టే అగ్ని ప్రమాదం జరిగిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్‌ వ్యాఖ్యానించారు.

Published : 04 Feb 2023 03:17 IST

బల్మూరి వెంకట్‌ను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

నారాయణగూడ, న్యూస్‌టుడే: కొత్త సచివాలయాన్ని ఏప్రిల్‌ 14నే ప్రారంభించాలని, ఫిబ్రవరి 17 దేవుడికి ఇష్టం లేదు కాబట్టే అగ్ని ప్రమాదం జరిగిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్‌ వ్యాఖ్యానించారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో కేఏ పాల్‌ అసెంబ్లీ వద్ద ఉన్న గన్‌పార్కులోకి వెళ్లడానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఆయన ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌, పోలీసులు తనను హైదరాబాద్‌లో లేకుండా చేయాలనుకుంటున్నారన్నారు.

అసెంబ్లీని ముట్టడించిన ఎన్‌ఎస్‌యూఐ

అసెంబ్లీ ముందు రహదారిపై ట్రాఫిక్‌ నిలిచిన వేళ.. పోలీసుల కళ్లుగప్పి ఆర్టీసీ బస్సులో వచ్చిన ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌, రేగులపాటి రితేష్‌రావు తదితరులు పార్టీ జెండాలతో అసెంబ్లీ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు, ఎన్‌ఎస్‌యుఐ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా వెంకట్‌ మాట్లాడుతూ.. డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని