logo

మధుయాస్కీ గౌడ్‌కు మాతృ వియోగం

టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌, మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్‌కు మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి అనసూయమ్మ(85) సోమవారం ఉదయం మరణించారు.

Published : 16 Apr 2024 05:58 IST

అనసూయమ్మ పార్దివ దేహానికి నివాళి అర్పిస్తున్న మంత్రులు ఉత్తమ్‌, సీతక్క, 
పాడె మోస్తున్న ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌, బంజారాహిల్స్‌, హయత్‌నగర్‌, న్యూస్‌టుడే: టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌, మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్‌కు మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి అనసూయమ్మ(85) సోమవారం ఉదయం మరణించారు. వృద్ధాప్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆమె..బంజారాహిల్స్‌లోని రోడ్‌ నం.10లోని మధుయాస్కీ నివాసంలో ఉంటున్నారు. నిద్రలేవకపోవడం, శరీరంలో కదలికలు లేకపోవడంతో సోమవారం ఉదయం 8.30గంటలకు సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సాయంత్రం హయత్‌నగర్‌లోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు.

సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల సంతాపం.. అనసూయమ్మ మృతికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు ఓ ప్రకటనలో సంతాపం ప్రకటించారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్‌, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌చౌదరి, విప్‌ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, సామేల్‌, సుధీర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, మాజీ మంత్రి రాజేశంగౌడ్‌, సీనియర్‌ నేత కేవీపీ రామచంద్రరావు, టీజేఎస్‌ అధినేత ప్రొఫెసర్‌ కోదండరాం, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌,  కాంగ్రెస్‌ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి,  బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని